రెండో పెళ్లికి రెడీ అయిన దిల్ రాజ్?

దిల్ రాజు.. ఫుల్ ఫామ్ లో ఉన్న టాలీవుడ్ అగ్ర నిర్మాత. ఆయన భార్య పోయిన సంవత్సరం హాఠాత్ మరణం చెందారు.. దిల్ రాజుకు పిల్లలకు పిల్లలు కూడా పుట్టారు. ఇద్దరు మనవళ్లు ఆయనకున్నారు.

అయితే దిల్ రాజు వయసు పెరిగినా కూడా అలా కనిపించడు. చాలా యంగ్ గానే కనిపిస్తాడు. ఆరోగ్యకరమైన తిండి, వ్యాయమాలు చేస్తానని.. అందుకే యంగ్ లా కనిపిస్తానని చెబుతుంటాడు.

అయితే ఆయన భార్య అనిత మరణించాక ఏడాది తర్వాత దిల్ రాజు రెండో వివాహానికి సిద్ధమైనట్లు టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో వార్త చక్కర్లు కొడుతోంది.

దిల్ రాజు భార్య మరణం తర్వాత పూర్తిగా బిజినెస్ మీదే పడి వ్యవహారాలు చూసుకుంటున్నాడని.. ఆయన వ్యక్తిగత జీవితాన్ని పట్టించుకోవడం లేదని ఆయన కుటుంబ సభ్యులు మథనపడుతున్నారట.. అందుకే అత్యంత సన్నిహితులైన వారి సలహా మేరకు తర్వలోనే రెండో వివాహానికి దిల్ రాజును ఒప్పించినట్టు సమాచారం.

దిల్ రాజు వ్యక్తిగత జీవితంలోని అగాధాన్ని పూడ్చాలని…. సంతోషాన్ని పంచాలనే వారు రెండో పెళ్లికి ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం.