జ్వాలా రెడ్డిగా మారిన మిల్కీ బ్యూటీ

కెరీర్ లో ఇప్పటికే కొన్ని విలక్షణ పాత్రలు పోషించింది తమన్న. బాహుబలి, సైరా సినిమాల్లో విలక్షణ పాత్రలు పోషించిన తమన్న, ఇప్పుడు మరోసారి అలాంటిదే ఓ ఛాలెంజింగ్ పాత్ర పోషిస్తోంది. సీటీమార్ సినిమాలో కబడ్డీ కోచ్ గా కనిపించనుంది తమన్న. ఆమె పాత్ర పేరు జ్వాలా రెడ్డి. తాజాగా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు.

గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతోంది సీటీమార్. ‘యు టర్న్‌’లాంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.3గా శ్రీనివాసా చిట్టూరి నిర్మాణంలో హై బడ్జెట్‌, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతోన్న‌ ఈ సినిమాలో గోపీచంద్ సరసన తమన్న హీరోయిన్ గా నటిస్తోంది. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా రావడం ఇదే ఫస్ట్ టైమ్.

తరుణ్ అరోర విలన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి మెలోడి బ్ర‌హ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. తన కెరీర్ లో జ్వాలా రెడ్డి పాత్ర మరో మైలురాయిగా నిలిచిపోతుందని చెబుతోంది తమన్న. ఈ సమ్మర్ లో థియేటర్లలోకి రానుంది సీటీమార్.