Telugu Global
NEWS

కియా ఎఫెక్ట్... డిఫెన్స్ లో పడిపోయిన టీడీపీ నేతలు

కియా మోటర్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిపోతోంది అంటూ ఓ సెక్షన్ ఆఫ్ మీడియా తెగ గగ్గోలు చేసేసింది. ఆపండ్రా బాబూ.. మేం ఎక్కడికీ వెళ్లడం లేదు అని.. స్వయానా.. కియా సంస్థ ప్రతినిధులే స్పష్టం చేసినా.. పరిశ్రమలు వెళ్లిపోతున్నాయి.. వెళ్లిపోతున్నాయి.. అంటూ.. కొందరు నానా యాగీ చేశారు. చివరికి ఏమైంది? మేము ఎక్కడకీ వెళ్లిపోవడం లేదని స్వయానా కియా ఎండీనే ప్రకటించారు. ఇలాంటి వార్తలు నమ్మొద్దన్నారు. అనంతపురాన్ని వదిలి తాము ఎక్కడికీ వెళ్లేది లేదని చెప్పారు. ఈ […]

కియా ఎఫెక్ట్... డిఫెన్స్ లో పడిపోయిన టీడీపీ నేతలు
X

కియా మోటర్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిపోతోంది అంటూ ఓ సెక్షన్ ఆఫ్ మీడియా తెగ గగ్గోలు చేసేసింది. ఆపండ్రా బాబూ.. మేం ఎక్కడికీ వెళ్లడం లేదు అని.. స్వయానా.. కియా సంస్థ ప్రతినిధులే స్పష్టం చేసినా.. పరిశ్రమలు వెళ్లిపోతున్నాయి.. వెళ్లిపోతున్నాయి.. అంటూ.. కొందరు నానా యాగీ చేశారు.

చివరికి ఏమైంది? మేము ఎక్కడకీ వెళ్లిపోవడం లేదని స్వయానా కియా ఎండీనే ప్రకటించారు. ఇలాంటి వార్తలు నమ్మొద్దన్నారు. అనంతపురాన్ని వదిలి తాము ఎక్కడికీ వెళ్లేది లేదని చెప్పారు.

ఈ పరిణామంతో షాక్ తిన్న టీడీపీ నేతలు ఉన్న ఫళంగా సైలెంట్ అయ్యారు. ఆందోళనలు ఆపేశారు. అధినేత వద్దన్నారో.. లేక తమంతట తామే మారారో కానీ.. కియా విషయాన్ని చంద్రబాబు నుంచి మాజీ మంత్రులు, నాయకులు, కార్యకర్తలు.. ట్విటర్ పిట్ట లోకేష్ వరకూ ఎవరూ మాట్లాడడం లేదు. ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుందని.. తప్పుడు ప్రచారాలు చేసే వాళ్లను వదిలేది లేదని చెప్పడం వల్లే అంతా ఒక్కసారిగా సైలెంట్ అయ్యారని అంటున్నారు.

అసలే.. ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు చుట్టు ముడుతున్నాయి.. రీ టెండర్లతో వేల కోట్ల ప్రజాధనం ఆదా అవుతోంది… అధిక ధరలకు టెండర్లు ఇచ్చిన వైనంపై విచారణ జరిగే అవకాశమూ ఉంది.

ఇవన్నీ చూస్తుంటే.. ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎలాంటి పిడుగు మీద పడుతుందో.. మనకు వచ్చిన చిక్కు ఎందుకులే.. అని మరికొందరు టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నట్టు.. ఈ విషయాన్నే అధినేత చంద్రబాబుకు చెప్పి సైలెంట్ అయినట్టు తెలుస్తోంది.

First Published:  9 Feb 2020 1:31 AM GMT
Next Story