Telugu Global
NEWS

కివీస్ చేతిలో ఓటమితో కొహ్లీ ఉక్కిరిబిక్కిరి

న్యూజిలాండ్ చేతిలో వరుసగా రెండో ఓటమి అంతర్జాతీయ క్రికెట్ మూడుఫార్మాట్లలోనూ గత కొద్ది మాసాలుగా విజయపరంపర కొనసాగిస్తూ వచ్చిన విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారతజట్టుకు దిమ్మతిరిగిపోయే దెబ్బ తగిలింది. న్యూజిలాండ్ తో జరుగుతున్న తీన్మార్ వన్డే సిరీస్…మొదటి రెండు వన్డేల్లోనూ భారత్ ఓటమి వెంట ఓటమితో సిరీస్ చేజార్చుకొంది. రెండోర్యాంకర్ భారత్.. కొహ్లీ నాయకత్వంలో సిరీస్ చేజార్చుకోడం ప్రస్తుత సీజన్లో ఇదే మొదటిసారి. ఐదుమ్యాచ్ ల టీ-20 సిరీస్ ను 5-0తో అలవోకగా నెగ్గిన భారత్…వన్డే సిరీస్ లో మాత్రం […]

కివీస్ చేతిలో ఓటమితో కొహ్లీ ఉక్కిరిబిక్కిరి
X
  • న్యూజిలాండ్ చేతిలో వరుసగా రెండో ఓటమి

అంతర్జాతీయ క్రికెట్ మూడుఫార్మాట్లలోనూ గత కొద్ది మాసాలుగా విజయపరంపర కొనసాగిస్తూ వచ్చిన విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారతజట్టుకు దిమ్మతిరిగిపోయే దెబ్బ తగిలింది.

న్యూజిలాండ్ తో జరుగుతున్న తీన్మార్ వన్డే సిరీస్…మొదటి రెండు వన్డేల్లోనూ భారత్ ఓటమి వెంట ఓటమితో సిరీస్ చేజార్చుకొంది. రెండోర్యాంకర్ భారత్.. కొహ్లీ నాయకత్వంలో సిరీస్ చేజార్చుకోడం ప్రస్తుత సీజన్లో ఇదే మొదటిసారి.

ఐదుమ్యాచ్ ల టీ-20 సిరీస్ ను 5-0తో అలవోకగా నెగ్గిన భారత్…వన్డే సిరీస్ లో మాత్రం తేలిపోయింది. అక్లాండ్ వేదికగా జరిగిన కీలక రెండో వన్డేలో సైతం… న్యూజిలాండ్ 22 పరుగులతో నెగ్గడం ద్వారా 2-0తో సిరీస్ ఖాయం చేసుకొంది.

ఈడెన్ పార్క్ వేదికగా ముగిసిన నిర్ణయాత్మక రెండో వన్డేలో ముందుగా బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 273 పరుగుల స్కోరు సాధించడం ద్వారా.. భారత్ ఎదుట 274 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

అయితే…విరాట్ సేన మాత్రం 48.3 ఓవర్లలో 251 పరుగులకే కుప్పకూలింది. 22 పరుగుల తేడాతో వరుసగా రెండో పరాజయం చవిచూసింది.

ఓటమితో కొహ్లీ ఇబ్బంది…

గత కొంతకాలంగా… విజయోత్సాహంతో మీడియా సమావేశాలలో పాల్గొన్న భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ… తొలిసారిగా వరుస పరాజయాలను, సిరీస్ ఓటమిని ఎదుర్కొని.. అసౌకర్యానికి గురయ్యాడు. ఓటమిని ఏ విధంగా సమర్థించుకోవాలో తెలియక ఉక్కిరిబిక్కిరయ్యాడు.

ప్రస్తుత సంవత్సరంలో …టీ-20 ప్రపంచకప్ పైన మాత్రమే తాము దృష్టిని కేంద్రీకరించామని…ప్రస్తుత వన్డే సిరీస్ లో ఓటమికి ఏమాత్రం ప్రాధాన్యం లేదంటూ.. సమర్థించుకొన్నాడు.

ఆస్ట్ర్రేలియా వేదికగా అక్టోబర్లో జరిగే టీ-20 ప్రపంచకప్ పైనే తమజట్టు దృష్టి కేంద్రీకరించినట్లు కొహ్లీ తెలిపాడు. మొత్తం మీద వరుస విజయాల జోష్ తో ఇంతకాలమూ పొంగిపోయిన కొహ్లీకి వరుస పరాజయాలు ఎంత ఇబ్బందికరమో తెలిసి వచ్చింది.

2019 వన్డే ప్రపంచకప్ సెమీస్ లో న్యూజిలాండ్ కొట్టిన దెబ్బతో ట్రోఫీ చేజార్చుకొన్న విరాట్ సేన…ఇప్పుడు వన్డే సిరీస్ లోనూ అదే అనుభవాన్ని ఎదుర్కొనడమే ఇక్కడి అసలు పాయింట్.

First Published:  8 Feb 2020 10:04 PM GMT
Next Story