బిగ్ బాష్ 2020 విజేత సిడ్నీ సిక్సర్స్

  • ఫైనల్లో మెల్బోర్న్ స్టార్స్ పరాజయం

ఆస్ట్ర్రేలియా దేశవాళీ టీ-20 బిగ్ బాష్ 2020 సీజన్ టైటిల్ ను మోజెస్ హెన్రికేస్ నాయకత్వంలోని సిడ్నీ సిక్సర్స్ జట్టు గెలుచుకొంది. సిడ్నీ క్రికెట్ స్టేడియం వేదికగా ముగిసిన టైటిల్ సమరానికి వానదెబ్బ తగిలినా…ఫలితం రాబట్టడంలో నిర్వాహక సంఘం సఫలమయ్యింది.

గత రెండురోజులుగా కురిసిన కుండపోత వర్షాలకు సిడ్నీ క్రికెట్ స్టేడియం తడిసిముద్దగా మారినా…12 ఓవర్లకే మ్యాచ్ ను పరిమితం చేసి నిర్వహించారు.

ముందుగా బ్యాటింగ్ కు దిగిన సిడ్నీ సిక్సర్స్ 116 పరుగుల స్కోరు సాధించి…ప్రత్యర్థి ఎదుట 117 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది.

అయితే …గ్లెన్ మాక్స్ వెల్ నాయకత్వంలోని మెల్బోర్న్ స్టార్స్ మాత్రం 6 వికెట్లకు 97 పరుగులు మాత్రమే చేయగలిగింది. సిడ్నీ సిక్సర్స్ బిగ్ బాష్ లీగ్ టైటిల్ నెగ్గడం ఇది రెండోసారి మాత్రమే.

2011-12 సీజన్ నుంచి నిర్వహిస్తూ వస్తున్న బిగ్ బాష్ లీగ్ ను రెండుమాసాలపాటు …56 మ్యాచ్ లతో నిర్వహించారు.