Telugu Global
NEWS

కరోనా చైనాలో జనానికి సోకితే.... ఆంధ్రాలో రాజకీయాలకు సోకింది

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్.. చైనాలో వందలాది మందిని మృత్యువాత పట్టిస్తోంది. అక్కడి నుంచి ఇతర దేశాలకు ఆ వైరస్ వ్యాప్తి చెందుతోంది. దాదాపు ప్రతి దేశం ఈ విషయంలో జాగ్రత్తలు పాటిస్తోంది. కేరళలో అయితే హెల్త్ ఎమర్జెన్సీని కూడా ప్రకటించాల్సివచ్చింది. విచిత్రంగా.. ఈ కరోనా వైరస్ మన రాజకీయాలకూ పాకింది. వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా.. తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల విమర్శలు, ప్రతి విమర్శలు చూస్తుంటే.. ఇది నిజమే అనిపిస్తోంది. కావాలంటే మీరూ ఈ […]

కరోనా చైనాలో జనానికి సోకితే.... ఆంధ్రాలో రాజకీయాలకు సోకింది
X

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్.. చైనాలో వందలాది మందిని మృత్యువాత పట్టిస్తోంది. అక్కడి నుంచి ఇతర దేశాలకు ఆ వైరస్ వ్యాప్తి చెందుతోంది. దాదాపు ప్రతి దేశం ఈ విషయంలో జాగ్రత్తలు పాటిస్తోంది.

కేరళలో అయితే హెల్త్ ఎమర్జెన్సీని కూడా ప్రకటించాల్సివచ్చింది. విచిత్రంగా.. ఈ కరోనా వైరస్ మన రాజకీయాలకూ పాకింది. వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా.. తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల విమర్శలు, ప్రతి విమర్శలు చూస్తుంటే.. ఇది నిజమే అనిపిస్తోంది. కావాలంటే మీరూ ఈ విషయాన్ని తెలుసుకోండి. నిజమే అని ఒప్పుకొంటారు.

జగన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సంచలన రీతిలో పథకాలు అమలు చేస్తూ వినూత్న చర్యలు తీసుకుంటోంది. గ్రామ సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేసి.. వాలంటీర్లను ఆ వ్యవస్థకు అనుసంధానం చేసి.. సంక్షేమ పథకాలు నిజమైన అర్హులకు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని చెబుతోంది. ఇదే కాక.. మరిన్ని కార్యక్రమాలు అమలు చేస్తూ.. జనాల్లోకి వెళ్తోంది. సహజంగానే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. కాకపోతే.. ఓ అడుగు దాటి అనవసరమైన విమర్శలు బయటికి వస్తున్నాయి.

సీఎం వైఎస్ జగన్.. కరోనా వైరస్ కన్నా ప్రమాదకారి అంటూ టీడీపీ అధినేత చంద్రబాబే స్వయంగా కామెంట్ చేయడం రాజకీయ వర్గాలనే ఒకింత ఆశ్చర్యపరిచింది. విమర్శలను తిప్పికొట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు కూడా.. టిట్ ఫర్ టాట్ అన్నట్టు… ప్రపంచానికి కరోనా వైరస్ పడితే.. రాష్ట్రానికి చంద్రన్న వైరస్ పట్టిందని కామెంట్ చేశారు.

ఇలా.. కరోనా వైరస్.. అనారోగ్యాన్ని సృష్టించడమే కాదు.. రాజకీయాలనూ కదిలిస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఆంధ్రా రాజకీయాలకు కరోనా వైరస్ సోకినట్టే కనిపిస్తోందని సరదాగా కామెంట్ చేస్తున్నారు.

First Published:  10 Feb 2020 4:56 AM GMT
Next Story