ఆర్జీవీతో ఢీ అంటే ఢీ… ఏకంగా సినిమా తీస్తున్నాడు

ఇన్నాళ్లు రాంగోపాల్ వర్మ అందరినీ ఆడేసుకున్నాడు. ఎన్టీఆర్ పేరు చెప్పి చంద్రబాబును, బాలయ్యను కడిగేశాడు. బెజవాడ రౌడీలంటూ వంగవీటి రంగా హత్యను వాడుకున్నాడు. సీమ ఫ్యాక్షన్‌ గొడవలను కథగా రక్త చరిత్ర రెండు భాగాలను చూపించి వారిని టార్గెట్ చేశారు.

అందరినీ టార్గెట్ చేసే రాంగోపాల్ వర్మనే తాజాగా టార్గెట్ చేశాడు ప్రముఖ సినీ గీత రచయిత జొన్నవిత్తుల. తాజాగా ఆయన సంచలన విషయాన్ని బయటపెట్టాడు.

‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ మూవీ ప్రమోషన్ సమయంలో రాంగోపాల్ వర్మకు, జొన్నవిత్తులకు మధ్య వార్ నడిచింది. ఇద్దరి మధ్య మాటల దాడి పతాక స్థాయికి చేరింది. జొన్నవిత్తులపై దారుణ కామెంట్స్ చేశాడు వర్మ. అంతే ధీటుగా బదులిచ్చాడు జొన్నవిత్తుల.

ఇప్పుడు వర్మపై ప్రతీకారానికి ప్లాన్ చేశాడు. తాజాగా తాను ‘ఆర్జీవీ’ పేరుతో సినిమా తీస్తున్నానంటూ ప్రకటించారు. ఈ సినిమాను జొన్నవిత్తులనే డైరెక్ట్ చేస్తున్నాడట.. రాంగోపాల్ వర్మ మీద ఆయన పేరుతోనే ఎక్కుపెట్టిన సెటైరికల్ చిత్రమని జొన్నవిత్తుల ప్రకటించడం టాలీవుడ్ లో సంచలనమైంది.

కొంత మంది టాలీవుడ్ లో స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారని.. వారి మీదే ఈ సినిమా అంటూ జొన్నవిత్తుల తెలిపారు. మరి ఇందులో వర్మ బండారం ఏం బయటపెడుతారనేది ఆసక్తిగా మారింది.