Telugu Global
Cinema & Entertainment

పలాస నిండా కత్తెర్లే

తమ్మారెడ్డి భరధ్వాజ సమర్పిస్తున్న సినిమా పలాస 1978. మొన్నటివరకు ఈ సినిమాను గ్రామీణ నేపథ్యంలో సాగే ఓ వయొలెన్స్ డ్రామా అనుకున్నారంతా. తీరా సెన్సార్ కు వెళ్లిన తర్వాత అసలు విషయం తెలిసింది. ఈ సినిమాలో హింస ఏ రేంజ్ లో ఉందో, రొమాన్స్ కూడా అదే రేంజ్ లో ఉందట. అది కూడా పైపైన చూసే రొమాన్స్ కాదు. కాస్త డీప్ గా చూపించిన రొమాన్స్. ఒక దశలో సెన్సార్ అధికారులే షాక్ అయ్యే రేంజ్ […]

పలాస నిండా కత్తెర్లే
X

తమ్మారెడ్డి భరధ్వాజ సమర్పిస్తున్న సినిమా పలాస 1978. మొన్నటివరకు ఈ సినిమాను గ్రామీణ నేపథ్యంలో సాగే ఓ వయొలెన్స్ డ్రామా అనుకున్నారంతా. తీరా సెన్సార్ కు వెళ్లిన తర్వాత అసలు విషయం తెలిసింది. ఈ సినిమాలో హింస ఏ రేంజ్ లో ఉందో, రొమాన్స్ కూడా అదే రేంజ్ లో ఉందట. అది కూడా పైపైన చూసే రొమాన్స్ కాదు. కాస్త డీప్ గా చూపించిన రొమాన్స్. ఒక దశలో సెన్సార్ అధికారులే షాక్ అయ్యే రేంజ్ లో ఈ సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలున్నాయట.

అలా ఈ సినిమాకు మ్యూట్స్ తో కలిపి 26 కట్స్ చెప్పింది సెన్సార్ బోర్డ్. అధికారులు ఈ రేంజ్ లో కత్తెర్లు వేయడంతో సినిమా మరోసారి హాట్ టాపిక్ గా మారింది. పలాస లో మంచి అడల్ట్ కంటెంట్ ఉందనే టాక్ బయట బాగా వ్యాప్తి చెందింది. అచ్చంగా తమది అడల్ట్ సినిమా అని చెప్పుకునే వైఫ్ ఐ, ఏడు చేపల కథ, డిగ్రీకాలేజ్ లాంటి సినిమాలకు కూడా ఇన్ని కట్స్ పడలేదంటే.. పలాస మూవీలో బోల్డ్ కంటెంట్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

కరుణకుమార్ డైరక్ట్ చేసిన ఈ సినిమా కథ శ్రీకాకుళం జిల్లాలో ఉండే పలాస అనే పట్టణం బ్యాక్ డ్రాప్ లో నడుస్తోంది. ఇంతకుముందు లండన్ బాబులు సినిమా చేసిన రక్షిత్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు… మ్యూజిక్ డైరక్టర్ రఘు కుంచె ఈ సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీకి సంగీతం అందించింది కూడా ఇతడే.

First Published:  9 Feb 2020 7:02 PM GMT
Next Story