బస్సుల్లో వ్యభిచారమా…. అది కూడా వారి బస్సుల్లోనా?

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో వ్యభిచారమా? అది కూడా సీనియర్ నాయకుడికి చెందిన బస్సుల్లో ఈ వైపరిత్యమా? చాలా మంది నిజమే అని అంటున్నారు. కొన్నేళ్ల క్రితమే ఈ దందా జరిగిందని చెబుతున్నారు. అధికారులకూ తెలిసే ఇది జరిగిందని.. ఆ సమయంలో సదరు సంస్థ నిర్వాహకులు అధికార పార్టీలో ఉన్నారని ఆరోపిస్తున్నారు.

ఇప్పుడు ఆ నాయకుడు ప్రతిపక్షంలో ఉన్నాడు. ముఖ్యమంత్రి జగన్ ను పరిపరివిధాలా విమర్శిస్తున్నాడు. తమ పార్టీ అధినేత మెప్పు కోసమో.. తన రాజకీయ లాభం కోసమో.. లేదంటే తన సంస్థల ప్రయోజనాల కోసమో కానీ.. ఆయన మాత్రం పూర్తిగా అటువైపే ఉన్నాడు. తర్వాత అధికార పార్టీలోకి వద్దామని ప్రయత్నించినా వీలు పడ లేదు.

ఇప్పుడు.. మరోసారి ఆయన గారి బస్సుల గురించే రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. బస్సులను నడపడంలో అన్నీ కరెక్ట్ గా ఉంటే కుదరదు అంటూ.. సదరు యజమాని వ్యాఖ్యానించడంతో.. తాజాగా ఈ వ్యభిచార పుకార్లకు బలం చేకూరుతోంది. తప్పు చేసినట్టుగానే భావించాల్సి వస్తోంది. ఈ వ్యవహారంపై ప్రజలైతే విస్మయం చెందుతున్నారు.

ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది.. అసలు ఇలాంటి వ్యవహారం జరిగిందా లేదా అన్నది.. ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.