బిగ్ బాస్ పునర్నవి ప్రేమికుడు ఇతడేనట.. రాహుల్ కు షాక్

పునర్నవి భూపాలం.. బిగ్ బాస్ 3 ద్వారా తెలుగు నాట ఫేమస్ అయిన వర్ధమాన హీరోయిన్. టాలీవుడ్ లో సైడ్ క్యారెక్టర్లతో మొదలై చిన్న సినిమాలు చేసిన పునర్నవి బిగ్ బాస్ షో లో డేరింగ్ డ్యాషింగ్ గా ఉంటూ రాహుల్ సిప్లిగంజ్ తో ప్రేమ ఒలకబోసింది. వీరిద్దరూ ప్రేమలో పడిపోయారని వార్తలు వచ్చాయి. రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ విజేతగా నిలవడంతో వీరిద్దరి ప్రేమ బయట కూడా కొనసాగుతుందా లేదా అన్న విషయంపై క్లారిటీ రాలేదు. ప్రేమికులేనని పుకార్లు షికారు చేశాయి.

ఇటీవలే పునర్నవి భారీగా వెయిట్ కూడా పెరిగింది. దీంతో సినిమాలు వదిలేసి పెళ్లి చేసుకొని సెటిల్ అవుతుందని వార్తలు వచ్చాయి.

ఇక బిగ్ బాస్ 3 ముగిశాక బయట కూడా పలు టీవీ షోలు, కార్యక్రమాలకు పునర్నవి-రాహుల్ రావడంతో వారిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలను రాహుల్ ఖండించాడు.

తాజాగా తనకు రాహుల్ తో ఎఫైర్ లేదని చెప్పే ప్రయత్నం పునర్నవి చేసింది. తాను ఒక హైదరాబాదీతో ప్రేమలో ఉన్నానని పేర్కొంది.

రాహుల్ సిప్లిగంజ్ తో తనకు సంబంధాల గురించి వస్తున్న పుకార్లకు స్వస్తి చెప్పేందుకే పునర్నవి ఇలా తనకో కొత్త బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలిపిందని… అది అర్థమవుతోందని అంటున్నారు సినీ జనాలు.