Telugu Global
NEWS

జూనియర్ ప్రపంచకప్ విజేత బంగ్లాదేశ్

ఫైనల్లో పోరాడి ఓడిన భారత్ అండర్ -19 ప్రపంచకప్ ను వరుసగా రెండోసారి గెలుచుకోవాలన్న డిఫెండింగ్ చాంపియన్ ఆశలు అడియాసలయ్యాయి. సౌతాఫ్రికాలోని పోచెఫ్స్ ట్రూమ్ వేదికగా ముగిసిన లోస్కోరింగ్ ఫైనల్లో చిచ్చరపిడుగు బంగ్లాదేశ్ 3 వికెట్ల తేడాతో హాట్ ఫేవరెట్ భారత్ పై సంచలన విజయం సాధించింది. గత మూడువారాలుగా సాగిన ఈటోర్నీ బరిలోకి ..హాట్ ఫేవరెట్ గా అడుగుపెట్టిన భారత్ అంచనాలకు తగ్గట్టుగా రాణించి ఫైనల్స్ చేరినా…టైటిల్ సమరంలో.. చెత్త బ్యాటింగ్ తో తేలిపోయింది. పానీపురీ […]

జూనియర్ ప్రపంచకప్ విజేత బంగ్లాదేశ్
X
  • ఫైనల్లో పోరాడి ఓడిన భారత్

అండర్ -19 ప్రపంచకప్ ను వరుసగా రెండోసారి గెలుచుకోవాలన్న డిఫెండింగ్ చాంపియన్ ఆశలు అడియాసలయ్యాయి. సౌతాఫ్రికాలోని పోచెఫ్స్ ట్రూమ్ వేదికగా ముగిసిన లోస్కోరింగ్ ఫైనల్లో చిచ్చరపిడుగు బంగ్లాదేశ్ 3 వికెట్ల తేడాతో హాట్ ఫేవరెట్ భారత్ పై సంచలన విజయం సాధించింది.

గత మూడువారాలుగా సాగిన ఈటోర్నీ బరిలోకి ..హాట్ ఫేవరెట్ గా అడుగుపెట్టిన భారత్ అంచనాలకు తగ్గట్టుగా రాణించి ఫైనల్స్ చేరినా…టైటిల్ సమరంలో.. చెత్త బ్యాటింగ్ తో తేలిపోయింది.

పానీపురీ కుర్రాడి ఒంటరిపోరాటం…

టైటిల్ పోరులో టాస్ నెగ్గి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకొన్న బంగ్లాజట్టు…ప్రత్యర్థి భారత్ ను 47.2 ఓవర్లలో 177 పరుగులకే కుప్పకూల్చింది. డిపెండబుల్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ఒక్కడే ఒంటరిపోరాటం చేసి 121 బాల్స్ల్ లో 88 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

సమాధానంగా 178 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన బంగ్లాజట్టు కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చినా… భారత లెగ్ స్పిన్నర్ రవి బిష్నోయ్ ..మ్యాజిక్ చేసి.. 4 కీలక వికెట్లు పడగొట్టడం ద్వారా మ్యాచ్ ను మలుపు తిప్పాడు.

వర్షంతో మ్యాచ్ కు అంతరాయం కలగడంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం బంగ్లా లక్ష్యాన్ని 42.1 ఓవర్లలో 170 పరుగులుగా సవరించారు. బంగ్లా కెప్టెన్ అక్బర్ అలీ 77 బాల్స్ ఎదుర్కొని 43 పరుగులతో అజేయంగా నిలవడం ద్వారా తనజట్టుకు 3 వికెట్ల చిరస్మరణీయ విజయం అందించాడు.

2015 ప్రపంచకప్ క్వార్టర్ పైనల్స్ లో భారత్ చేతిలో పరాజయం పొందిన బంగ్లాదేశ్…ప్రస్తుత ప్రపంచకప్ ఫైనల్లో విజేతగా నిలవడం ద్వారా బదులుతీర్చుకోగలిగింది.

ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ యశస్వి జైస్వాల్…

ప్రపంచకప్ లో భారతజట్టు మూడోసారి రన్నరప్ గా నిలిచినా…ఓపెనర్ యశస్వి జైస్వాల్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. మొత్తం ఆరుమ్యాచ్ లు ఆడిన జైస్వాల్ ఓ సెంచరీ 4 హాఫ్ సెంచరీలతో సహా 400 పరుగులు చేయడం ద్వారా టాప్ స్కోరర్ గా నిలిచాడు. అత్యుత్తమ ప్లేయర్ కు ఇచ్చే ప్లేయర్ ఆఫ్ ది 2020 ప్రపంచకప్ అవార్డు అందుకొన్నాడు.

మొత్తం ఆరుమ్యాచ్ ల్లో 17 వికెట్లు పడగొట్టిన భారత లెగ్ స్పిన్నర్ రవి బిష్నోయ్ ..అత్యుత్యమ బౌలర్ ఘనతను సొంతం చేసుకొన్నాడు. 1988 నుంచి 2020 వరకూ జరిగిన మొత్తం 12 ప్రపంచకప్ టోర్నీలలో భారత్ నాలుగుసార్లు విజేతగా, మూడుసార్లు రన్నరప్ గా, రెండుసార్లు తృతీయస్థానంలో నిలవడమే కాదు.. ఏడుసార్లు ఫైనల్స్ చేరిన ఏకైకజట్టుగా నిలిచిపోయింది.

First Published:  10 Feb 2020 12:25 AM GMT
Next Story