Telugu Global
International

బిల్ గేట్స్ మనసు పారేసుకున్నారు.. ఎవరిపైనో తెలుసా?

అపర కుబేరుడిగా పేరు గాంచిన మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్.. మనసు పారేసుకున్నారు. ఆయన పడిన ఆ ముచ్చట తెలుసుకుని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఆ సంతోషం విలువ చూసి.. షాక్ తింటున్నారు. ఇంతకీ.. అదేంటన్నదే మీ అనుమానమైతే.. ఈ వివరాలు తెలుసుకోండి. గత ఏడాది మొనాకోలో.. అత్యంత విలాసమైన విహార నౌక (యాట్)ల నమూనా ప్రదర్శన జరిగింది. ఆ షో కు బిల్ గేట్స్ హాజరయ్యారు. పర్యావరణానికి ఏ మాత్రం హాని చేయని యాట్ ను చూసి […]

బిల్ గేట్స్ మనసు పారేసుకున్నారు.. ఎవరిపైనో తెలుసా?
X

అపర కుబేరుడిగా పేరు గాంచిన మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్.. మనసు పారేసుకున్నారు. ఆయన పడిన ఆ ముచ్చట తెలుసుకుని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఆ సంతోషం విలువ చూసి.. షాక్ తింటున్నారు. ఇంతకీ.. అదేంటన్నదే మీ అనుమానమైతే.. ఈ వివరాలు తెలుసుకోండి.

గత ఏడాది మొనాకోలో.. అత్యంత విలాసమైన విహార నౌక (యాట్)ల నమూనా ప్రదర్శన జరిగింది. ఆ షో కు బిల్ గేట్స్ హాజరయ్యారు. పర్యావరణానికి ఏ మాత్రం హాని చేయని యాట్ ను చూసి ముచ్చటపడ్డారు. తన కోసం ప్రత్యేకంగా ఈ విహార నౌకను తయారుచేయించాలని భావించి.. వెంటనే కొంత మొత్తాన్ని చెల్లించి పనులు మొదలు పెట్టించేశారు.

అంతగా ఏం ప్రత్యేకత ఉంది ఇందులో అంటారేమో.. అదీ తెలుసుకోండి. ఈ నౌక పొడవు 370 అడుగులు. 4 గెస్టు రూములు, 2 వీఐపీ రుములు, యజమాని గది ప్రత్యేకంగా ఉంటుంది. 14 మంది అతిథులు, 31 మంది సిబ్బంది ఇందులో ప్రయాణం చేయవచ్చు. జిమ్, యోగా స్టుడియో, బ్యూటీ రూమ్, మసాజ్ పార్లర్, స్విమ్మింగ్ పూల్ లాంటి మరిన్ని ప్రత్యేకతలు.. ఈ ఓడ సొంతం.

మరో విశేషం ఏంటంటే.. ఈ నౌక నుంచి విడుదలయ్యే వ్యర్థాలు.. నీటి రూపంలోనే ఉంటాయట. అలాగే.. ఒక సారి హైడ్రోజన్ ద్రవ ఇంధనం నింపితే.. 3,750 మైళ్లు ప్రయాణిస్తుందట. ఇందులో నుంచి బయటకు వెళ్లి విహారం చేసేందుకు మరో 2 బోట్లు కూడా ఉండడం విశేషమే. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ ఓడ ఖర్చు ఏ మాత్రం ఉంటుందో.. అని ఆలోచించకండి. మన కరెన్సీలో… 4 వేల 600 కోట్ల రూపాయలు మాత్రమే. అదీ సంగతి.

First Published:  10 Feb 2020 8:50 PM GMT
Next Story