Telugu Global
Cinema & Entertainment

వేసవిలో రొమాంటిక్ గా రాబోతున్నాడు

‘రొమాంటిక్’ మూవీతో తనయుడు ఆకాష్ పూరి కి హిట్ ఇచ్చేందుకు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అన్ని విధాలుగా రెడీ అవుతున్నారు. సినిమా ప్రొడక్షన్ స్టార్టయిన దగ్గర్నుంచి మంచి ప్రమోషనల్ స్ట్రాటజీస్ తో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. ఈ మూవీ విడుదల తేదీని సైతం తనదైన స్టయిల్ లో అనౌన్స్ చేశాడు. మే 29న ప్రపంచవ్యాప్తంగా ‘రొమాంటిక్’ను థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించాడు పూరి. సమ్మర్ హాలిడేస్ లో మంచి వినోదంతో కాలక్షేపాన్ని ఆశించేవాళ్లకు ఈ సినిమా […]

వేసవిలో రొమాంటిక్ గా రాబోతున్నాడు
X

‘రొమాంటిక్’ మూవీతో తనయుడు ఆకాష్ పూరి కి హిట్ ఇచ్చేందుకు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అన్ని విధాలుగా రెడీ అవుతున్నారు. సినిమా ప్రొడక్షన్ స్టార్టయిన దగ్గర్నుంచి మంచి ప్రమోషనల్ స్ట్రాటజీస్ తో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. ఈ మూవీ విడుదల తేదీని సైతం తనదైన స్టయిల్ లో అనౌన్స్ చేశాడు.

మే 29న ప్రపంచవ్యాప్తంగా ‘రొమాంటిక్’ను థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించాడు పూరి. సమ్మర్ హాలిడేస్ లో మంచి వినోదంతో కాలక్షేపాన్ని ఆశించేవాళ్లకు ఈ సినిమా అలాంటి కాలక్షేపాన్ని ఇస్తుందని చెబుతున్నాడు. హీరోయిన్ కేతికా శర్మతో హీరో ఆకాష్ లిప్ లాక్ చేస్తున్న రిలీజ్ డేట్ పోస్టర్ ఆకట్టుకుంటోంది.

రమ్యకృష్ణ ఒక ముఖ్య పాత్ర చేస్తున్న ఈ మూవీని అనిల్ పాడూరి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇంటెన్స్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఇప్పటికే 2 పాటలు రిలీజ్ చేశారు. ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

First Published:  10 Feb 2020 9:27 PM GMT
Next Story