తమన్ పార్ట్ టైమ్ బిజినెస్

మొన్నటివరకు రీ-రికార్డింగ్ అంటే అంతా మణిశర్మ వైపు చూసేవారు. కానీ ఇప్పుడు మణిశర్మ స్థానంలోకి తమన్ వచ్చి చేరాడు. అవును.. మణిశర్మ తర్వాత రీ-రికార్డింగ్ స్పెషలిస్ట్ అనిపించుకున్నాడు తమన్. తన సినిమాలకు సంగీతం అందిస్తూనే, పక్క సినిమాలకు ఆర్ఆర్ ఇస్తున్నాడు ఈ కంపోజర్. తాజాగా V అనే సినిమాను కూడా ఇలానే దక్కించుకున్నాడు.

నాని-సుధీర్ బాబు హీరోలుగా నటిస్తున్న V అనే సినిమాకు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడు. అయితే అతడ్ని పాటల వరకే పరిమితం చేశాడు నిర్మాత దిల్ రాజు. రీ-రికార్డింగ్ అందించే బాధ్యతను తమన్ కు అప్పగించాడు. ఇలా చేయడం వల్ల సినిమాకు లోకల్ ఫీల్ రావడంతో పాటు పని కూడా త్వరగా పూర్తవుతుంది.

ఇలాంటి పార్ట్ టైమ్ బిజినెస్ లు చేయడం తమన్ కు కొత్తేంకాదు. మజిలీ సినిమాకు ఇలానే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. సైరా, సాహో లాంటి సినిమాలకు కూడా పార్ట్ టైమ్ వర్క్ చేశాడు. ఇప్పుడు V సినిమాకు కూడా సేవలు అందిస్తున్నాడు.