Telugu Global
National

మాజీ క్రీడాకారులకు కేంద్రప్రభుత్వ పెన్షన్

నెలకు 12వేల నుంచి 20 వేల వరకూ సాయం జీవితకాల పెన్షన్ ప్రకటించిన క్రీడామంత్రి అంతర్జాతీయస్థాయిలో భారత్ కు పతకాలు సాధించినా…వృద్ధాప్యంలో పలు రకాల కష్టాలు ఎదుర్కొంటున్న మాజీ క్రీడాకారులను ఆదుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అనారోగ్యం, ఆర్థికసమస్యలతో సతమతమవుతున్న 30 సంవత్సరాలు దాటిన భారత మాజీ క్రీడాకారులకు జీవితకాలం పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు.. కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రి కిరణ్ రిజ్జూ ప్రకటించారు. అనారోగ్యం, అంగవైకల్యం, ఆర్థికసమస్యలతో బాధపడుతున్న మాజీ క్రీడాకారులను పండిట్ దీన్ […]

మాజీ క్రీడాకారులకు కేంద్రప్రభుత్వ పెన్షన్
X
  • నెలకు 12వేల నుంచి 20 వేల వరకూ సాయం
  • జీవితకాల పెన్షన్ ప్రకటించిన క్రీడామంత్రి

అంతర్జాతీయస్థాయిలో భారత్ కు పతకాలు సాధించినా…వృద్ధాప్యంలో పలు రకాల కష్టాలు ఎదుర్కొంటున్న మాజీ క్రీడాకారులను ఆదుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.

అనారోగ్యం, ఆర్థికసమస్యలతో సతమతమవుతున్న 30 సంవత్సరాలు దాటిన భారత మాజీ క్రీడాకారులకు జీవితకాలం పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు.. కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రి కిరణ్ రిజ్జూ ప్రకటించారు.

అనారోగ్యం, అంగవైకల్యం, ఆర్థికసమస్యలతో బాధపడుతున్న మాజీ క్రీడాకారులను పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ వెల్ఫేర్ ఫండ్ స్కీమ్ కింద ఆదుకొంటామని కిరణ్ రిజ్జూ తెలిపారు.

ప్రస్తుతం వివిధ క్రీడలకు చెందిన 627 మంది మాజీ క్రీడాకారులకు నెలవారీ పెన్షన్లు అందచేస్తున్నామని, 12వేల రూపాయలు కనీస పెన్షన్ గాను, 20వేల రూపాయలు గరిష్ట పెన్షన్ గాను నిర్ణయించినట్లు వివరించారు.

ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్, పారా ఒలింపిక్స్ లో దేశానికిప్రాతినిథ్యం వహించి…ఆర్ధికంగా నిలదొక్కుకోలేని మాజీ క్రీడాకారులకు మాత్రమే జీవితకాలం పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు.

క్రికెట్ , టెన్నిస్ , బ్యాడ్మింటన్, ఫుట్ బాల్ లాంటి గ్లోబల్ గేమ్స్, కబడ్డీ లాంటి దేశవాళీ క్రీడల క్రీడాకారులు కోట్ల రూపాయలకు పడగలెత్తుతుంటే…నాటి, నిన్నటి తరానికి చెందిన మాజీ ఒలింపియన్లు, పలురకాల అంతర్జాతీయ క్రీడల్లో భారత్ కు ప్రాతినిథ్యం వహించిన ఎందరో..క్రీడాజీవితం ముగిసిన తర్వాత ఆర్థికస్థిరత్వం లేక నానాపాట్లుపడుతున్నారు.

రోగాలబారిన పడిన మాజీ క్రీడాకారులు పలువురు చికిత్సకోసం తమ ఆస్తులను హారతికర్పూరంలా ఖర్చు పెట్టి సాయం కోసం అర్ధించే దయనీయ పరిస్థితిలో చిక్కుకోడాన్ని మించిన విషాదం మరొకటిలేదు.

First Published:  10 Feb 2020 9:30 PM GMT
Next Story