Telugu Global
National

టీజీ వెంకటేష్ వ్యాఖ్యలపై.. బీజేపీ నాయకత్వం ఏమంటుందో?

కర్నూలుకు చెందిన సీనియర్ నాయకుడు టీజీ వెంకటేష్.. రాజధాని విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. సొంతపార్టీని ఉద్దేశించి కీలక కామెంట్లు చేశారు. ఈ విషయాన్ని ఆ పార్టీ అధిష్టానం సీరియస్ గా తీసుకునే అవకాశాలు కనిపించడం లేదు కానీ.. ఎలా స్పందిస్తుంది అన్న విషయం అయితే ఆసక్తికరంగా మారింది. తన పార్టీ.. అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతు ఇస్తున్నట్టుగా కనిపిస్తోందని టీజీ.. ఓ ముఖాముఖిలో అనుమానం వ్యక్తం చేశారు. పనిలో పనిగా.. ఎవరూ ఊహించని ఓ సరికొత్త.. వింతగా […]

టీజీ వెంకటేష్ వ్యాఖ్యలపై.. బీజేపీ నాయకత్వం ఏమంటుందో?
X

కర్నూలుకు చెందిన సీనియర్ నాయకుడు టీజీ వెంకటేష్.. రాజధాని విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. సొంతపార్టీని ఉద్దేశించి కీలక కామెంట్లు చేశారు. ఈ విషయాన్ని ఆ పార్టీ అధిష్టానం సీరియస్ గా తీసుకునే అవకాశాలు కనిపించడం లేదు కానీ.. ఎలా స్పందిస్తుంది అన్న విషయం అయితే ఆసక్తికరంగా మారింది. తన పార్టీ.. అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతు ఇస్తున్నట్టుగా కనిపిస్తోందని టీజీ.. ఓ ముఖాముఖిలో అనుమానం వ్యక్తం చేశారు.

పనిలో పనిగా.. ఎవరూ ఊహించని ఓ సరికొత్త.. వింతగా అనిపించే ప్రతిపాదనను ఆయన తెరపైకి తెచ్చారు. హైదరాబాద్ ను దేశ రెండో రాజధానిగా చేయడం కాదని.. అమరావతిని దేశానికి రెండో రాజధానిగా చేయాలంటూ.. జగన్ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపితే బాగుంటుందని అన్నారు. ఇది విన్న అందరూ.. ఏమని స్పందించాలో అర్థం కాక.. మౌనంగా ఉండిపోతున్నారు.

అమరావతి ఇంకా.. పరిపూర్ణతే సంతరించుకోలేదు. లేని నగరం పేరు చెప్పి.. కొత్త నగరాన్ని సృష్టించే పని జరిగింది. ఇంతలో మూడు రాజధానుల ప్రతిపాదన వచ్చింది. మధ్యలో.. అమరావతిని దేశ రెండో రాజధానిగా చేయడం ఏంది? అని సామాన్యుల నుంచైతే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి అనూహ్యమైన విషయాన్ని బీజేపీ అధిష్టానం ఎలా తీసుకోబోతోంది? ఏమని స్పందించబోతోంది? అన్నదే.. రాజకీయ వర్గాల్లో ఆలోచన రేకెత్తిస్తోంది.

వాస్తవానికి 3 రాజధానుల ప్రతిపాదన వచ్చిన కొత్తల్లో.. కాస్త పాజిటివ్ గా మాట్లాడిన వారిలో టీజీ వెంకటేష్ కూడా ఒకరు. కానీ.. కాలక్రమంలో ఆయన తన అభిప్రాయాలను కర్నూలు మీదుగా.. శ్రీబాగ్ ఒడంబడికను వెంట బెట్టుకుని.. చివరాఖరికి అమరావతిని దేశ రెండో రాజధానిని చేయాలన్నంతవరకూ వచ్చారు. ఇంకా ఎలాంటి డిమాండ్లు.. రాజధానిని ముడిపెట్టుకుని వస్తాయో చూడాలి. అంతా అమరావతి మహత్యం మరి.

First Published:  10 Feb 2020 9:02 PM GMT
Next Story