Telugu Global
NEWS

క్రికెట్ ను విశ్వవ్యాప్తం చేస్తున్న ఐసీసీ

కొత్తగా 49 దేశాలకు విస్తరించిన టీ-20 క్రికెట్ క్రికెట్ ను విశ్వవ్యాప్తం చేయటానికి అంతర్జాతీయ క్రికెట్ మండలి చేపట్టిన పలు చర్యలు సత్ఫలితానిస్తున్నాయి. బారత్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్ర్రేలియా, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్, జింబాబ్వే, వెస్టిండీస్, సౌతాఫ్రికా లాంటి సాంప్రదాయ టెస్ట్ హోదా పొందిన దేశాలకు మాత్రమే కాకుండా…. ఐసీసీకి అనుబంధంగా ఉన్న జపాన్, నైజీరియా, అమెరికా, కెనడా, గ్రెనెడా, ఫిజీ, థాయ్ లాండ్, నేపాల్ లాంటి దేశాలకు సైతం క్రికెట్ ను విస్తరింపచేయడంలో సఫలమయ్యింది. ఐర్లాండ్, […]

క్రికెట్ ను విశ్వవ్యాప్తం చేస్తున్న ఐసీసీ
X
  • కొత్తగా 49 దేశాలకు విస్తరించిన టీ-20 క్రికెట్

క్రికెట్ ను విశ్వవ్యాప్తం చేయటానికి అంతర్జాతీయ క్రికెట్ మండలి చేపట్టిన పలు చర్యలు సత్ఫలితానిస్తున్నాయి. బారత్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్ర్రేలియా, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్, జింబాబ్వే, వెస్టిండీస్, సౌతాఫ్రికా లాంటి సాంప్రదాయ టెస్ట్ హోదా పొందిన దేశాలకు మాత్రమే కాకుండా…. ఐసీసీకి అనుబంధంగా ఉన్న జపాన్, నైజీరియా, అమెరికా, కెనడా, గ్రెనెడా, ఫిజీ, థాయ్ లాండ్, నేపాల్ లాంటి దేశాలకు సైతం క్రికెట్ ను విస్తరింపచేయడంలో సఫలమయ్యింది. ఐర్లాండ్, అప్ఘనిస్థాన్ లాంటి జట్లను సైతం.. టెస్ట్ పొందిన దేశాలుగా గుర్తించింది.

5 మిలియన్ డాలర్ల వ్యయంతో…

క్రికెట్ ను గ్లోబల్ క్రీడగా విస్తరింప చేయడంతో పాటు ..ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఐసీసీ 50 లక్షల డాలర్ల బడ్జెట్ తో చర్యలు చేపట్టింది. 2019 నాటికి…సరికొత్తగా 49 దేశాలకు క్రికెట్ ను పరిచయం చేయడంతో పాటు…టీ-20 క్రికెట్లో పాల్గొనేలా తీర్చిదిద్దినట్లు ఐసీసీ ప్రకటించింది.

2018 నుంచి 2019 నాటికి క్రికెట్ ను 110 శాతం మేర విస్తరించడంలో సఫలమైనట్లు తెలిపింది.

92కు చేరిన అనుబంధం దేశాలు…

అంతర్జాతీయ క్రికెట్ మండలిలో శాశ్వతసభ్యత్వం కలిగిన దేశాలు 11 వరకూ మాత్రమే ఉంటే…అనుబంధదేశాలు 92 వరకూ ఉన్నాయి. వీటిలో 49 దేశాలజట్లు పురుషుల టీ-20లోనూ, 29 దేశాలజట్లు మహిళల టీ-20 విభాగంలోనూ పోటీకి దిగేలా చేయడంలో ఐసీసీ సఫలమయ్యింది.

23 గ్లోబల్ టీ-20 టోర్నీలు…

2019 సీజన్లో ప్రపంచ వ్యాప్తంగా …వివిధ స్థాయిల్లో ఐసీసీ 23 గ్లోబల్ టీ-20 టోర్నీలు నిర్వహించింది. వీటిలో రీజినల్, సబ్-రీజినల్ పోటీలను సైతం నిర్వహించారు. ఈ పోటీలలో 40 దేశాలకు చెందిన జట్లు తలపడటం విశేషం.

అంతేకాదు…సౌతాఫ్రికా వేదికగా ముగిసిన 2020 అండర్ -19 ప్రపంచకప్ లో నైజీరియా, జపాన్ యువజట్లు తొలిసారిగా తలపడితే… ఆస్ట్ర్రేలియా వేదికగా మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే మహిళా టీ-20 ప్రపంచకప్ లో థాయ్ లాండ్ తొలిసారిగా బరిలోకిదిగనుంది.

ఐసీసీ నిర్వహించిన ప్రపంచకప్ వివిధ అర్హత టోర్నీలలో 11 అనుబంధ దేశాలజట్లు తొలిసారిగా పాల్గొన్నాయి.

టీ-20 ర్యాంకింగ్స్ లో సైతం….

ఐసీసీ ప్రవేశపెట్టిన టీ-20 క్రికెటర్ల ర్యాంకింగ్స్ జాబితాలో 99 అనుబంధదేశాలకు చెందిన క్రికెటర్లు పురుషుల, మహిళల విభాగాలలో చోటు సంపాదించగలిగారు.

బ్యాటింగ్ పురుషుల విభాగంలో 25 మంది, మహిళల బ్యాటర్ల విభాగంలో 23 మంది, బౌలింగ్ పురుషుల విభాగంలో 30మంది, మహిళల విభాగంలో 21 మంది.. వ్యక్తిగత ర్యాంకింగ్స్ లో తొలిసారిగా చోటు సంపాదించగలిగారు.

పురుషుల విభాగంలో అనుబంధ దేశాలు పాల్గొనటం 14 శాతం, మహిళల విభాగంలో 13 శాతం పెరుగుదల ఉన్నట్లు ఐసీసీవార్షిక నివేదికలో బయటపెట్టింది.

మొత్తం మీద…ఈ భూఖండంలో 204 దేశాలు ఉంటే…99 దేశాల వరకూ క్రికెట్ ను విస్తరింప చేయడంలో ఐసీసీ సఫలం కాగలిగింది.

First Published:  11 Feb 2020 9:43 PM GMT
Next Story