Telugu Global
NEWS

భారత్, బంగ్లా జూనియర్ల పై ఐసీసీ సీరియస్

ఐదుగురు ఆటగాళ్లపై సస్పెన్ష్ వేటు భారత క్రికెటర్లపై బేడీ గరంగరం సౌతాఫ్రికా వేదికగా ముగిసిన అండర్ -19 ప్రపంచకప్ ఫైనల్లో తలపడిన సమయంలో విజేత బంగ్లాదేశ్, రన్నరప్ భారత జట్ల ఆటగాళ్లలో కొందరి ప్రవర్తనను ఐసీసీ మ్యాచ్ రిఫరీ తప్పుపట్టారు.నిబంధనలకు విరుద్ధంగా, మితిమీరి ప్రవర్తించడం ద్వారా జెంటిల్మెన్ గేమ్ క్రికెట్ కే తలవంపులు తెచ్చిన బంగ్లా క్రికెటర్లు తహీద్ హృదయ్, షమీమ్ హుస్సేన్, రకీబుల్ హసన్ లతో పాటు భారత జోడీ రవి బిష్నోయ్, ఆకాశ్ సింగ్ ల […]

భారత్, బంగ్లా జూనియర్ల పై ఐసీసీ సీరియస్
X
  • ఐదుగురు ఆటగాళ్లపై సస్పెన్ష్ వేటు
  • భారత క్రికెటర్లపై బేడీ గరంగరం

సౌతాఫ్రికా వేదికగా ముగిసిన అండర్ -19 ప్రపంచకప్ ఫైనల్లో తలపడిన సమయంలో విజేత బంగ్లాదేశ్, రన్నరప్ భారత జట్ల ఆటగాళ్లలో కొందరి ప్రవర్తనను ఐసీసీ మ్యాచ్ రిఫరీ తప్పుపట్టారు.నిబంధనలకు విరుద్ధంగా, మితిమీరి ప్రవర్తించడం ద్వారా జెంటిల్మెన్ గేమ్ క్రికెట్ కే తలవంపులు తెచ్చిన బంగ్లా క్రికెటర్లు తహీద్ హృదయ్, షమీమ్ హుస్సేన్, రకీబుల్ హసన్ లతో పాటు భారత జోడీ రవి బిష్నోయ్, ఆకాశ్ సింగ్ ల ప్రవర్తనను మ్యాచ్ రిఫరీ గ్రీమ్ లాబ్రోయ్ తప్పుపట్టారు.

దూకుడుగా వ్యవహరించడం, ప్రత్యర్థి ఆటగాడిగా పట్ల అమర్యాదగా ప్రవర్తించడం, అవాకులు చవాకులు పేలడాన్ని మ్యాచ్ రిఫరీ తీవ్రంగా పరిగణించారు. ఐదు డీమెరిట్ పాయింట్లతో పాటు రెండు నుంచి ఐదు మ్యాచ్ ల వరకూ ఆడకుండా నిషేధం విధించారు.

బంగ్లా, భారత కెప్టెన్ రియాక్షన్..

టైటిల్ సమరం జరిగిన సమయంలో తమజట్టులోని కొందరు ఆటగాళ్లు ప్రవర్తించినతీరు ఇబ్బందికరంగా అనిపించిందని భారత కెప్టెన్ ప్రియం గర్గ్, బంగ్లా కెప్టెన్ అక్బర్ అలీ చెప్పారు.

గెలుపు, ఓటమి ఆటలో భాగమని, బాగాఆడిన జట్టే విజేతగా నిలుస్తుందని, అయితే భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాల్సిన బాధ్యత మాత్రం ఆటగాళ్లదేనని మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ వ్యాఖ్యానించాడు.

మరోవైపు…బంగ్లా కెప్టెన్ మాత్రం…భావోద్వేగాలు ఆటలో భాగమేనని…తమజట్టులోని కొందరు నియంత్రించుకోలేకపోయారని.. చోటు చేసుకొన్న సంఘటనలను దురదృష్టకరమని వాపోయాడు.

కుర్రాళ్లకు బేడీ క్లాస్…

బంగ్లాదేశ్ తో ముగిసిన ఫైనల్లో భారత జట్టు ఆటతీరు మాత్రమే కాదు…ప్రవర్తన సైతం దారుణంగా ఉందని, మర్యాదస్తుల క్రీడ క్రికెట్ కే అమర్యాద తెచ్చేలా ప్రవర్తించడం ఏమాత్రం సమర్ధనీయం కాదని భారత మాజీ కెప్టెన్ బిషిన్ సింగ్ బేడీ మండిపడ్డారు. ఎంతో భవిష్యత్ ఉన్న యువఆటగాళ్లు ప్రవర్తించేది ఇలాగేనా అంటూ నిలదీశారు.

బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలలో భారత కుర్రాళ్లు దారుణంగా విఫలమైన కారణంగానే పరాజయం ఎదురయ్యిందని బేడీ అభిప్రాయపడ్డారు.

First Published:  11 Feb 2020 9:06 PM GMT
Next Story