Telugu Global
NEWS

25 లక్షల ఇళ్ల పట్టాలు.... తహసీల్దార్లే సబ్ రిజిస్ట్రార్లు

ఇళ్లు లేని నిరుపేదలకు పట్టాలు ఇచ్చేందుకు.. ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. హామీల్లో భాగమైన 25 లక్షల ఇళ్ల పట్టాలను.. అసలైన లబ్ధిదారులకు అందించేందుకు శర వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఉగాది నాటికి.. మాట ఇచ్చినట్టుగా అందరికీ పట్టాలు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. పట్టాల పంపిణీ మాత్రమే కాదు.. వాటిని లబ్ధిదారుల పేరిట రిజిస్టర్ చేసేందుకు అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేస్తోంది. 25 లక్షల పట్టాలకు రిజిస్ట్రేషన్లు అంటే సామాన్య విషయం కాదు. రాష్ట్రంలో ఉన్న […]

25 లక్షల ఇళ్ల పట్టాలు.... తహసీల్దార్లే సబ్ రిజిస్ట్రార్లు
X

ఇళ్లు లేని నిరుపేదలకు పట్టాలు ఇచ్చేందుకు.. ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. హామీల్లో భాగమైన 25 లక్షల ఇళ్ల పట్టాలను.. అసలైన లబ్ధిదారులకు అందించేందుకు శర వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఉగాది నాటికి.. మాట ఇచ్చినట్టుగా అందరికీ పట్టాలు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. పట్టాల పంపిణీ మాత్రమే కాదు.. వాటిని లబ్ధిదారుల పేరిట రిజిస్టర్ చేసేందుకు అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేస్తోంది.

25 లక్షల పట్టాలకు రిజిస్ట్రేషన్లు అంటే సామాన్య విషయం కాదు. రాష్ట్రంలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, అందులో ఉన్న సిబ్బంది సరిపోరు. అందుకే.. ఈ ప్రక్రియలో రెవిన్యూ వ్యవస్థలో కీలకమైన తహసీల్దార్ లను భాగస్వాములను చేయాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియ నిమిత్తం.. వారిని జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగా పరిగణిస్తున్నట్టుగా ఉత్తర్వులు జారీ చేసింది. అంతే కాదు.. తహసీల్దార్ కార్యాలయాలను జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా గుర్తిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఇక.. ఇళ్ల స్థలాల లబ్ధిదారులకు మరో మేలును చేకూరుస్తూ.. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించి.. వారి నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయవద్దని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. ఫలితంగా.. ప్రక్రియ సులువుగా పూర్తవడమే కాక.. లబ్ధిదారులకు త్వరగా పట్టాల అందజేత పూర్తి చేయవచ్చని జగన్ ప్రభుత్వం భావిస్తోంది. ఆ దిశగానే.. తాజా ఉత్తర్వులు విడుదల చేసింది.

First Published:  13 Feb 2020 12:46 AM GMT
Next Story