ఫార్ములావన్ గ్రాండ్ ప్రీకి కరోనా వైరస్ దెబ్బ

  • చైనీస్ గ్రాండ్ ప్రీ వాయిదా

కరోనా వైరస్ కేవలం చైనా, దాని చుట్టుపక్కల దేశాలను మాత్రమే కాదు…ఫార్ములావన్ రేస్ నిర్వాహకులను సైతం భయపెడుతోంది.

సర్పాల నుంచి మనుషులకు వ్యాపించే ఈ వైరస్ ఇప్పటికే వేలాదిమందిని పొట్టనపెట్టుకోడంతో.. ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి నానాపాట్లు పడుతున్నాయి. చైనా, జపాన్,హాంకాంగ్ లాంటి దేశాలతో పాటు ఆసియాఖండ దేశాలు సైతం ముందుజాగ్రత్త చర్యలు తీసుకొంటున్నాయి.

మరోవైపు …కరోనా వైరస్ ప్రభావం ఫార్ములావన్ నిర్వాహకులపైన సైతం పడుతోంది. షాంఘై వేదికగా ఏప్రిల్ లో జరగాల్సిన 2020 చైనీస్ గ్రాండ్ ప్రీని వాయిదా వేయాలని నిర్వాహక సంఘం కోరింది.

చైనాలో ఇప్పటికే 1,100 మంది కరోనావైరస్ తో ప్రాణాలు కోల్పోడంతో… ప్రపంచ ఆరోగ్యసంస్థ ముందస్తు హెచ్చరికలు చేయడంతో… చైనీస్ గ్రాండ్ ప్రీ రేస్ ను వాయిదా వేయక తప్పడం లేదని ఫార్ములా వన్ నిర్వాహక సంఘం ప్రకటించింది.

ఫార్ములావన్ కు చైనాలో లక్షలాదిమంది అభిమానులున్నారని, ఫార్ములావన్ రేస్ నిర్వహించడం కంటే…అభిమానుల ప్రాణాలే తమకు అత్యంత విలువైనవని నిర్వాహక సంఘం తెలిపింది.