Telugu Global
NEWS

శాసన మండలి చైర్మన్ Vs కార్యదర్శి

ఏపీలో రాజధాని రాజకీయాలు ఇప్పుడు శాసన మండలి కేంద్రంగా సాగుతున్నాయి. చంద్రబాబు కనుసన్నల్లో నడుస్తోన్న మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ తనకు ఉన్న అధికారాలన్నీ వినియోగిస్తున్నారు. ఇప్పటికే వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీయే రద్దు బిల్లులపై సెలెక్ట్ కమిటీలు వేయగా.. లెజిస్లేటీవ్ సెక్రెటరీ నిబంధనలకు విరుద్దంగా ఉందంటూ ఫైల్‌పై నోట్ రాసి వెనక్కు పంపిన సంగతి తెలిసిందే. తాజాగా కార్యదర్శి ఫైలు వెనక్కు పంపడంపై ఏపీ శాసన మండలి చైర్మన్ షరీఫ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. […]

శాసన మండలి చైర్మన్ Vs కార్యదర్శి
X

ఏపీలో రాజధాని రాజకీయాలు ఇప్పుడు శాసన మండలి కేంద్రంగా సాగుతున్నాయి. చంద్రబాబు కనుసన్నల్లో నడుస్తోన్న మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ తనకు ఉన్న అధికారాలన్నీ వినియోగిస్తున్నారు. ఇప్పటికే వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీయే రద్దు బిల్లులపై సెలెక్ట్ కమిటీలు వేయగా.. లెజిస్లేటీవ్ సెక్రెటరీ నిబంధనలకు విరుద్దంగా ఉందంటూ ఫైల్‌పై నోట్ రాసి వెనక్కు పంపిన సంగతి తెలిసిందే.

తాజాగా కార్యదర్శి ఫైలు వెనక్కు పంపడంపై ఏపీ శాసన మండలి చైర్మన్ షరీఫ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వెంటనే సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేసి తనకు నివేదించాలని షరీఫ్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. చైర్మన్ ఆదేశాలను బేఖాతరు చేసినందుకు ఆయన కోపంగా ఉన్నట్లు సమాచారం.

వెంటనే కమిటీలను ఏర్పాటు చేయాలని.. ఇంకా జాప్యం చేస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని కార్యదర్శికి హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

మరోవైపు వైసీపీ తాము సెలెక్ట్ కమిటీల్లో ఉండమని ఇప్పటికే లేఖ రాయడంతో కార్యదర్శి ఆ మేరకు ఎవరిని సభ్యులుగా ఉంచాలో తెలపమని చైర్మన్‌ను కోరినట్లు సమాచారం. రెండు కమిటీలను లీడ్ చేయవలసిన మంత్రులే సెలెక్ట్ కమిటీలో ఉండమని చెబుతుండటంతో కార్యదర్శికి కూడా కలిసి వచ్చింది. రెండు కమిటీల్లో ఎవరిని ఉంచాలో చెప్పాలని తిరిగి చైర్మన్‌నే సలహా కోరడంతో ఆయన డైలమాలో పడినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇలా రెండు బిల్లుల సెలెక్ట్ కమిటీల విషయంలో చైర్మన్ భంగపాటుకు గురయ్యారని.. ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట వినడం వల్లే ఇలా సంకట స్థితిలో పడ్డారని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.

ఆ రెండు బిల్లులను తిరస్కరించడమో.. పాస్ చేయడమో చేసుంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని.. చివరకు ఇది చైర్మన్ వర్సెస్ కార్యదర్శి వ్యవహారంలా మారిందనే చర్చ నడుస్తోంది.

First Published:  13 Feb 2020 3:46 AM GMT
Next Story