Telugu Global
NEWS

చంద్రబాబు స్వగ్రామంలో... జగన్ నిర్ణయానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన ప్రజలు...

తెలుగుదేశం పార్టీకి టైమ్ బాలేదో.. లేక ఇంకేదైనా ఇబ్బందో తెలియదు కానీ.. రకరకాలుగా ఆ పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వన్ సైడెడ్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ విజయం తర్వాత.. రాజధాని అమరావతిపై, ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్లమాధ్యమంపై ఆ పార్టీ చేస్తున్న వాదనకు అంతగా మద్దతు లభించడం లేదు. ఇప్పుడు మరో పరిణామం టీడీపీకి అశనిపాతంగా మారింది. అది కూడా.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో జరిగింది. […]

చంద్రబాబు స్వగ్రామంలో...  జగన్ నిర్ణయానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన ప్రజలు...
X

తెలుగుదేశం పార్టీకి టైమ్ బాలేదో.. లేక ఇంకేదైనా ఇబ్బందో తెలియదు కానీ.. రకరకాలుగా ఆ పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వన్ సైడెడ్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ విజయం తర్వాత.. రాజధాని అమరావతిపై, ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్లమాధ్యమంపై ఆ పార్టీ చేస్తున్న వాదనకు అంతగా మద్దతు లభించడం లేదు. ఇప్పుడు మరో పరిణామం టీడీపీకి అశనిపాతంగా మారింది. అది కూడా.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో జరిగింది.

ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిగా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందునా.. తెలుగును కచ్చితమైన సబ్జెక్టుగా నిబంధన కూడా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో.. నాయకులు, పార్టీల అభిప్రాయాలు ఎలా ఉన్నా.. విద్యార్థులు, తల్లిదండ్రులు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఈ మేరకు తీర్మానాలు చేసి మద్దతు తెలియజేస్తున్నారు.

చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో కూడా.. ఆంగ్లమాధ్యమాన్ని గ్రామస్తులంతా స్వాగతించారు. ఏకగ్రీవ తీర్మానం చేసి ప్రభుత్వ నిర్ణయానికి తమ మద్దతు తెలిపారు. ఓ వైపు టీడీపీ అధినేత చంద్రబాబు.. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని వ్యతిరేకిస్తున్న తరుణంలో.. ఆయన స్వగ్రామంలోని ప్రజలంతా కలిసి.. జగన్ ప్రభుత్వ నిర్ణయానికి ఏకగ్రీవ ఆమోదం తెలపడం.. టీడీపీకి ఇబ్బందికరంగా మారడం ఖాయమని అంతా అనుకుంటున్నారు.

గత ఎన్నికల్లోనే.. కుప్పం నుంచి చంద్రబాబుకు మెజారిటీ తగ్గిందని.. తాజాగా నారావారిపల్లె ప్రజలు ప్రభుత్వానికి జై కొట్టారని.. రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.

First Published:  12 Feb 2020 11:50 PM GMT
Next Story