బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసిన పాయల్

హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ పై చాలా రూమర్లు ఉన్నాయి. సెట్స్ లో ఆమె ఎక్కడుంటే ఓ కుర్రాడు అక్కడే కనిపిస్తాడు. ఆమె కెమెరా ముందుంటే.. ఆమె కారవాన్ లో ఆ కుర్రాడు రెస్ట్ తీసుకుంటాడు. ప్యాకప్ తర్వాత ఇద్దరూ కలిసి ఒకే కారులో వెళ్లిపోతారు. ఆ వ్యక్తి ఎవరంటూ ఫిలింనగర్ లో చాలా గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఎట్టకేలకు ఈ పుకార్లకు తెరదించింది పాయల్. అతడు తన బాయ్ ఫ్రెండ్ అంటూ ప్రకటించేసింది.

ఇతడి పేరు సౌరభ్. వృత్తిగతంగా మోడల్. నిర్మాత కూడా. కొన్నాళ్లుగా ఇతడితో డేటింగ్ చేస్తోంది పాయల్. తను ఇండస్ట్రీ వరకు రావడానికి, ఈ స్థాయికి ఎదగడానికి ఇతడే కారణం అంటోంది.

రీసెంట్ గా సౌరభ్ పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా అతడికి శుభాకాంక్షలు చెబుతూ, మేరీ జాన్ అంటూ పొగిడేసింది పాయల్.

తన జీవితానికి సుఖాన్ని, సంతోషాన్నిచ్చిన వ్యక్తిగా సౌరభ్ ను పేర్కొన్న పాయల్.. తన మంచి చెడుల్ని కూడా ప్రేమించే ఏకైక వ్యక్తిగా సౌరభ్ ను చెప్పుకొచ్చింది. అలా తామిద్దరం చాన్నాళ్లుగా డేటింగ్ లో ఉన్నామనే విషయాన్ని చెప్పకనే చెప్పేసింది పాయల్.