చైతూ సరసన “గీత”

rashmika mandanna movies list

వరుస అవకాశాలతో దూసుకుపోతోంది గీతగోవిందం బ్యూటీ రష్మిక. ఇప్పటికే మహేష్ సరసన నటించిన ఈ చిన్నది, త్వరలోనే బన్నీ-సుకుమార్ సినిమాలో కూడా మెరవనుంది. ఇప్పుడీ స్టార్ హీరోయిన్ మరో క్రేజీ ప్రాజెక్ట్ లో నటించే అవకాశం కొట్టేసింది.

నాగచైతన్య-పరశురాం కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో హీరోయిన్ గా రష్మికను అనుకుంటున్నారు. ఇంతకుముందు పరశురాం తీసిన గీతగోవిందం సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించింది. ఆ సెంటిమెంట్ ను చైతూ సినిమాకు కూడా కొనసాగించాలని అనుకుంటున్నాడు దర్శకుడు. ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మాతలుగా ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి రానుంది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమా చేస్తున్నాడు చైతూ. ఆ మూవీ థియేటర్లలోకి వచ్చిన వెంటనే పరశురాం మూవీ పట్టాలపైకి వస్తుంది. అన్నట్టు ఈ సినిమాకు నాగేశ్వరరావు అనే టైటిల్ అనుకుంటున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై ఈ టైటిల్ ను రిజిస్టర్ కూడా చేయించారు.