Telugu Global
NEWS

జాతీయ క్రీడ లేని దేశం భారత్

భారత జాతీయక్రీడ హాకీ కాదు… లిఖితపూర్వకంగా ప్రభుత్వ వివరణ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం, జనాభాపరంగా రెండో అతిపెద్ద దేశం భారత్ కు..జాతీయ క్రీడ అంటూ ఏదీలేదని అధికారికంగా నిర్దారణయ్యింది. ఇంతకాలమూ హాకీనే భారత జాతీయక్రీడ అంటూ జోరుగా ప్రచారం సాగింది. అంతేకాదు…ప్రభుత్వం జాతీయ, రాష్ట్ర్రస్థాయిలో నిర్వహించే పోటీపరీక్షల్లో సైతం భారత జాతీయ క్రీడ ఏదంటూ ప్రశ్నవేయటం, హాకీ అన్న సమాధానానికి మార్కులు వేయటం జరిగిపోయాయి. 1928 ఆమ్ స్టర్ డామ్ ఒలింపిక్స్ నుంచి 1980 మాస్కో […]

జాతీయ క్రీడ లేని దేశం భారత్
X
  • భారత జాతీయక్రీడ హాకీ కాదు…
  • లిఖితపూర్వకంగా ప్రభుత్వ వివరణ

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం, జనాభాపరంగా రెండో అతిపెద్ద దేశం భారత్ కు..జాతీయ క్రీడ అంటూ ఏదీలేదని అధికారికంగా నిర్దారణయ్యింది.

ఇంతకాలమూ హాకీనే భారత జాతీయక్రీడ అంటూ జోరుగా ప్రచారం సాగింది. అంతేకాదు…ప్రభుత్వం జాతీయ, రాష్ట్ర్రస్థాయిలో నిర్వహించే పోటీపరీక్షల్లో సైతం భారత జాతీయ క్రీడ ఏదంటూ ప్రశ్నవేయటం, హాకీ అన్న సమాధానానికి మార్కులు వేయటం జరిగిపోయాయి.

1928 ఆమ్ స్టర్ డామ్ ఒలింపిక్స్ నుంచి 1980 మాస్కో ఒలింపిక్స్ వరకూ భారత్ అత్యధికంగా హాకీ క్రీడలోనే ఎనిమిదిబంగారు పతకాలు సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. దీంతో …భారత్ కు ఒలింపిక్స్ లో అత్యధిక స్వర్ణపతకాలు సంపాదించి పెట్టిన హాకీనే జాతీయక్రీడగా పరిగణిస్తూ వచ్చారు. ఇంతగా ప్రచారం జరుగుతున్నా.. గత కొన్ని దశాబ్దాలుగా కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు పెదవి విప్పలేదు.

అయితే..ఆర్టీఏ చట్టం పుణ్యమా ఇంటూ…భారత్ కు జాతీయ క్రీడ అనేది ఏదీలేదనేది వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్ర్రలోని ధూలే జిల్లాకు చెందిన ఓ స్కూల్ టీచర్.. భారత జాతీయ క్రీడ ఏదంటూ…ఆర్టీఏ ద్వారా ప్రభుత్వ వివరణ కోరారు. దీంతో ..భారత్ కు జాతీయక్రీడ అంటూ ఏదీలేదంటూ…కేంద్రక్రీడామంత్రిత్వశాఖ నుంచి బదులు వచ్చింది. దేశంలో అన్నిరకాల క్రీడలను ప్రోత్సహించడం కోసమే జాతీయక్రీడగా దేనిని ప్రకటించలేదని వివరణ ఇచ్చింది.

ఆగస్టు 29ని జాతీయ క్రీడా దినోత్సవంగాను, హాకీని జాతీయక్రీడగా పరిగణిస్తూ…ప్రభుత్వం ఏటా…హాకీ పితామహుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతిరోజున.. జాతీయ క్రీడాపురస్కారాలను ప్రదానం చేసే కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహిస్తూ వస్తోంది. అయితే…జాతీయ క్రీడ అంటూ అధికారికంగా ఏదీలేని దేశంగా భారత్ మిగిలిపోవడం శోచనీయం.

భూటాన్ లాంటి చిన్నదేశానికి విలువిద్య జాతీయక్రీడగా ఉంటే…స్పెయిన్ కు బుల్ ఫైట్, పొరుగుదేశం పాకిస్థాన్ కు కబడ్డీ జాతీయ క్రీడలుగా ఉన్నాయి.

భారత్ లో హాకీ జాతీయక్రీడ అన్న భావన అందరిలో పాతుకుపోయినా…అత్యంత జనాదరణ పొందుతున్న క్రీడగా, అనధికారిక జాతీయక్రీడగా క్రికెట్ చెలామణిలో ఉంది.

First Published:  13 Feb 2020 8:43 PM GMT
Next Story