అవును… లోకేష్ చెప్పింది నిజం

ఇటీవల వారం రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఐటీ దాడులపై టీడీపీ నాయకులు, మాజీ మంత్రి నారా లోకేష్‌ స్పందించారు.

ఏపీలో జరిగిన ఐటీ దాడులు కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు ఉందని లోకేష్‌ కామెంట్ చేశారు.

40 చోట్ల ఐటీ సోదాలు నిర్వహిస్తే…. అతి తక్కువ మొత్తంలో నగదు దొరికిందని ఆయన అన్నారు.

లోకేష్‌ కామెంట్స్‌ పై కొందరు నెటిజన్‌లు బాగానే స్పందిస్తున్నారు….

లోకేష్‌ చెప్పింది నిజం… ఐటీ దాడులతో ఆ అధికారులు కొండను తొవ్వి ఎలుకలనే పట్టారు…. నిజానికి అనకొండలన్నీ ఇంకా కొండల్లోనే ఉన్నాయి…. చంద్రబాబు పీఏ దగ్గరే 2,000 కోట్లు దొరికితే ఇక చంద్రబాబు దగ్గర ఎంత దొరకాలి? లోకేష్‌ దగ్గర ఎంత దొరకాలి? బహుశా ఆ ఉద్దేశం తోనే లోకేష్‌ మాజీ పీఏ శ్రీనివాస్‌ దగ్గర దొరికిన బ్లాక్‌ మనీ విషయంలో ఇలా కామెంట్ చేసి ఉంటాడని అంటున్నారు.