మళ్లీ లవర్ బాయ్ గా మారాడు

అశ్వథ్థామ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు నాగశౌర్య. అయితే ఈ సినిమా హిట్టవ్వడంతో ఇకపై ఇలాంటి మాస్, యాక్షన్ క్యారెక్టర్లకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాడని, తన మార్క్ ప్రేమకథలు తగ్గించేస్తాడని అంతా అనుకున్నారు. కానీ అశ్వథ్థామ లాంటి యాక్షన్ సినిమా తర్వాత ఓ కూల్ రొమాంటిక్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నాగశౌర్య.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగశౌర్య, రీతూవర్మ హీరోహీరోయిన్లుగా కొత్త సినిమా ప్రారంభమైంది. ఈ సినిమాతో లక్ష్మీసౌజన్య దర్శకురాలిగా పరిచయం అవుతోంది. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరపైకొస్తోంది ఈ ప్రేమకథ. ఈనెల 19 నంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.

నిజానికి ఏడాది కిందటే ఈ కథతో సినిమా సెట్స్ పైకి రావాల్సింది. అప్పట్లో ఈ స్టోరీ పట్టుకొని అన్నపూర్ణ స్టుడియోస్ లో బాగా ప్రయత్నించారు లక్ష్మీసౌజన్య. కుదిరితే నాగచైతన్య, కుదరకపోతే అఖిల్ తో ఈ సినిమా చేయాలనుకున్నారు. ఒక దశలో నాగార్జున కూడా ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఆనంది ఆర్ట్స్ తో కలిసి సినిమా నిర్మించాలని అనుకున్నారు. కానీ అనుకోని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోవడం, ఇప్పుడా కథను నాగశౌర్య ఓకే చెప్పడం చకచకా జరిగిపోయాయి.