Telugu Global
NEWS

ఆరు నూరైనా ఆర్డినెన్స్ తెచ్చే యోచనలో ఏపీ ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వ మూడు రాజధానుల ప్రతిపాదనను సాధ్యమైనంతగా అడ్డుకోవాలని టీడీపీ పట్టుదలతో ఉంది. కాగా, అదే సమయంలో ఆరు నూరైనా మూడు రాజధానుల విషయంలో ముందుకే వెళ్లాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది. సీఆర్డీయే రద్దు బిల్లు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులను మండలి చైర్మన్ సెలెక్ట్ కమిటీకి పంపారు. దీంతో ఈ రెండు బిల్లులపై ఆర్డినెన్స్ తీసుకొని రావాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే న్యాయ నిపుణులు, మంత్రులు, అధికారులతో చర్చలు జరుపుతోంది. మండలిలో సెలెక్ట్ […]

ఆరు నూరైనా ఆర్డినెన్స్ తెచ్చే యోచనలో ఏపీ ప్రభుత్వం
X

ఏపీ ప్రభుత్వ మూడు రాజధానుల ప్రతిపాదనను సాధ్యమైనంతగా అడ్డుకోవాలని టీడీపీ పట్టుదలతో ఉంది. కాగా, అదే సమయంలో ఆరు నూరైనా మూడు రాజధానుల విషయంలో ముందుకే వెళ్లాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది.

సీఆర్డీయే రద్దు బిల్లు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులను మండలి చైర్మన్ సెలెక్ట్ కమిటీకి పంపారు. దీంతో ఈ రెండు బిల్లులపై ఆర్డినెన్స్ తీసుకొని రావాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే న్యాయ నిపుణులు, మంత్రులు, అధికారులతో చర్చలు జరుపుతోంది.

మండలిలో సెలెక్ట్ కమిటీ వివాదం ఇంకా నడుస్తున్న సందర్భంగా అసెంబ్లీ, మండలిని ప్రోరోగ్ చేస్తూ నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రోరోగ్ చేయడం వల్ల ఆర్డినెన్స్ తెచ్చే వెసులుబాటు ఏర్పడుతుంది. కాగా, ఆర్డినెన్స్ తెచ్చినా కోర్టులో కేసులు నడుస్తుండటంతో ఈ నెల 26 వరకు రాజధాని తరలింపు సాధ్యం కాకపోవచ్చు.

మరోవైపు ఆర్డినెన్స్ తెచ్చినా.. దానిని మళ్లీ అసెంబ్లీ, మండలికి పంపాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. ఇక ఆర్డినెన్స్ తెస్తే దానిపై కోర్టుకు వెళ్లాలని తెలుగుదేశం భావిస్తోంది. రూల్ నెంబర్ 154 కింద సెలెక్ట్ కమిటీకి పంపిన బిల్లులపై ఆర్డినెన్స్ ఎలా తెస్తారని.. ఒక వేళ తెచ్చినా గవర్నర్ ఆమోదం తెలపరని టీడీపీ అంటోంది. ముందస్తుగా గవర్నర్‌ను కూడా కలవాలని టీడీపీ నిర్ణయించింది. కాని ప్రభుత్వం తెచ్చే ఆర్డినెన్స్‌ను తిరస్కరించే అధికారం గవర్నర్‌కు ఉండదని వైసీపీ వర్గాలు అంటున్నాయి.

First Published:  14 Feb 2020 4:48 AM GMT
Next Story