Telugu Global
NEWS

చంద్రబాబు మళ్లీ స్టే తెచ్చుకుంటారా... కోర్టు మెట్లెక్కుతారా?

స్టే గడువు ముగిసింది. తెలుగు దేశం అధినేత చంద్రబాబుపై దాఖలైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.. మళ్లీ ధర్మాసనం తలుపు తడుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకురాలు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి దాఖలు చేసిన పిటిషన్ పై.. ఈ నెల 26న మళ్లీ విచారణ జరగనుంది. శుక్రవారమే.. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ కోర్టులో వాదనలు జరిగాయి. చంద్రబాబు ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖను దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ లక్ష్మీపార్వతి […]

చంద్రబాబు మళ్లీ స్టే తెచ్చుకుంటారా... కోర్టు మెట్లెక్కుతారా?
X

స్టే గడువు ముగిసింది. తెలుగు దేశం అధినేత చంద్రబాబుపై దాఖలైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.. మళ్లీ ధర్మాసనం తలుపు తడుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకురాలు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి దాఖలు చేసిన పిటిషన్ పై.. ఈ నెల 26న మళ్లీ విచారణ జరగనుంది. శుక్రవారమే.. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ కోర్టులో వాదనలు జరిగాయి.

చంద్రబాబు ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖను దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ లక్ష్మీపార్వతి ఈ పిటిషన్ వేశారు. ఫిర్యాదు దశలోనే పిటిషన్ నిలుస్తున్నందున చంద్రబాబు తరఫు వాదనలు వినరాదని ఆమె చేసిన విజ్ఞప్తిని కోర్టు అంగీకరించింది. సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గ దర్శకాల ప్రకారం.. ఆర్నెల్లు గడిస్తే ఏ స్టే అయినా గడువు ముగిసినట్టే.. అని లక్ష్మీ పార్వతి తరఫు లాయర్ల వాదనలను కోర్టు అంగీకరించింది.

ఈ లెక్కన గతంలో కోర్టు ఇచ్చిన స్టే గడువు ముగిసినట్టే అని… అందుకే విచారణ చేయాలని… దర్యాప్తునకు ఏసీబీని ఆదేశించాలని లక్ష్మీ పార్వతి చేసిన విజ్ఞప్తిని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ నెల 26న ఈ వాదనలను పరిశీలిస్తామని తెలిపింది. దీంతో.. మరోసారి చర్చ మొదలైంది. మళ్లీ స్టే కోసం చంద్రబాబు ప్రయత్నిస్తారా.. లేదంటే తాను నిప్పు అని చెప్పుకొనే ఆయన.. ఈ సారైనా దర్యాప్తునకు సహకరిస్తారా.. అన్నది చర్చనీయాంశంగా మారింది.

ఒకవేళ కోర్టు విచారణకు ఆదేశిస్తే మాత్రం.. చంద్రబాబు హాజరవుతారా.. కోర్టు మెట్లెక్కుతారా.. న్యాయ వ్యవస్థలో ఉన్న నిబంధనల్లో తనకు అనుకూల అంశాలు ఏమైనా ఉన్నాయా.. అన్నది పరిశీలిస్తారా.. ఏమో చూద్దాం. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా.. ఇప్పుడాయన ప్రతిపక్షంలో ఉన్నారాయె.. కేంద్రంలో ఉన్న బీజేపీతో ఏనాడో తెగదెంపులు చేసుకున్నారాయె.

First Published:  15 Feb 2020 3:30 AM GMT
Next Story