నితిన్ పెళ్లి పనులు ప్రారంభం

ఎట్టకేలకు నితిన్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆరేళ్లుగా తనపై వినిపిస్తున్న పెళ్లి పుకార్లకు, డేటింగ్ రూమర్లకు చెక్ పెట్టిన ఈ హీరో… ఈ రోజు తన లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్ షాలినీ తో కలిసి పెళ్లి పనులు ప్రారంభించాడు.

ఈరోజు నితిన్-షాలిని మధ్య చిన్న ఫంక్షన్ జరిగింది. అయితే అది పసుపు-కుంకుమ ఫంక్షనా లేక నిశ్చితార్థమా అనేది క్లారిటీ లేదు. మొత్తానికి పెళ్లి పనులైతే ప్రారంభమయ్యాయంటూ నితిన్ ట్వీట్ చేశాడు. షాలినితో దిగిన ఫొటోల్ని కూడా షేర్ చేశాడు.

8 ఏళ్లుగా నితిన్-షాలిని ఒకరికొకరు పరిచయం. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా నితిన్ కు షాలిని పరిచయమైంది. అప్పట్నుంచి ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. దాదాపు ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. రీసెంట్ గా ఇంట్లో పెద్దల్ని ఒప్పించి పెళ్లికి సిద్ధమౌతున్నారు. ఈ విషయాలన్నీ స్వయంగా నితిన్ ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు.

ఏప్రిల్ 16న దుబాయ్ లో నితిన్-షాలిని పెళ్లి చేసుకోబోతున్నారు. అదే నెల చివరి వారంలో టాలీవుడ్ ప్రముఖులకు రిసెప్షన్ పార్టీ ఇవ్వబోతున్నాడు ఈ హీరో. వచ్చేవారం నితిన్ నటించిన భీష్మ సినిమా థియేటర్లలోకి వస్తోంది.