అది నా కష్టార్జితంతో కొన్నది…. పవన్ పై రేణు దేశాయ్ కామెంట్స్

జనసేనాని, స్టార్ హీరో పవన్ కల్యాణ్ పై ఆయన మాజీ భార్య రేణుదేశాయ్ మరోసారి తన ఫేస్ బుక్ ఖాతా లో ఎమోషనల్ పోస్టు పెట్టారు. కొద్దిరోజులుగా మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై తన ఆవేదనను వెళ్లగక్కారు. దయచేసి మీడియాలో ఇలాంటి తప్పుడు ప్రచారం చేయవద్దని కోరారు.

ఇటీవలే రేణుదేశాయ్ కు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో ఓ ఖరీదైన ఫ్లాట్ కానుకగా ఇచ్చాడని ప్రముఖ మీడియాలో వార్తలు వచ్చాయి. పవన్-రేణుల పిల్లలు కెరీర్ లో ఎదుగుతుండడంతో వారు హైదరాబాద్ లో ఉండడం కోసమే పవన్ ఇలా ఫ్లాట్ ను కొనుగోలు చేసినట్టు ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో, పలు వెబ్ సైట్లలోనూ ఈ వార్తలు కొనసాగాయి.

దీనిపై రేణు దేశాయ్ తన ఫేస్ బుక్ ఖాతాలో ఆవేదన వ్యక్తం చేశారు. ‘కొన్ని రోజులుగా నా స్నేహితుల నుంచి.. మీడియా నుంచి ఓ వార్త తెలుసుకున్నా.. వారు చేస్తున్న ఫోన్స్ కాల్స్, మెసేజ్ లు చూసి నేను తప్పక స్పందించాల్సిన సీరియస్ విషయం అని అర్థమైంది.. అందుకే ఈ పోస్టు పెడుతున్నానని…’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తాను పవన్ తో విడిపోయి ఒంటరిగా ఇద్దరు పిల్లల తల్లిగా నీతిగా.. నిజాయితీగా ఆత్మగౌరవంతో బతుకుతున్నానని… ఇలాంటి రాతలు రాసి అస్థిత్వాన్ని దెబ్బతీయవద్దని అందరినీ కోరారు.

తనకు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో ఎలాంటి ఫ్లాట్ కొనివ్వలేదని.. అది నా కష్టార్జితంతో ఒక్కో రూపాయి కూడబెట్టుకొని నా సొంత పైసలతో ఇల్లు కొన్నానని రేణు వివరణ ఇచ్చింది. ఇప్పటికైనా నాకు పవన్ ఫ్లాట్ ఇచ్చారన్న ప్రచారాన్ని ఆపాలని కోరారు.

నేను ఇప్పుడు మీ అందరికీ ఈ విషయం గురించి వివరణ ఇవ్వడానికి ఒకే ఒక్క కారణం, నిన్నటి నుండి నాకు మీడియా వాళ్ళ నుండి,…

Publiée par Renu Desai sur Jeudi 13 février 2020