వరల్డ్ ఫేమస్ లవర్ మొదటి రోజు వసూళ్లు

విజయ్ కు క్రేజ్ తగ్గింది. అతడి సినిమాలకు వసూళ్లు తగ్గాయి. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా సాక్షిగా ఈ విషయం అందరికీ తెలిసొచ్చింది. అవును.. నిన్న రిలీజైన ఈ సినిమాకు ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు. ఇంకా చెప్పాలంటే విజయ్ కెరీర్ లో ఇది బెస్ట్ ఓపెనర్ కాదు.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 4 కోట్ల 30 లక్షల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది. ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్ కంటే.. విజయ్ నటించిన ఫ్లాప్ మూవీ నోటాకు ఎక్కువ వసూళ్లు వచ్చాయంటే.. అప్పటికీ ఇప్పటికీ విజయ్ దేవరకొండ క్రేజ్ ఎలా తగ్గిందో అర్థం చేసుకోవచ్చు.

ఇక సినిమా విషయానికొస్తే.. మొదటి రోజే ఈ సినిమాపై క్రిటిక్స్ పెదవి విరిచారు. కంటెంట్ ఆశించిన స్థాయిలో లేదంటూ రివ్యూలు పెట్టేశారు. ఈ నేపథ్యంలో.. సోమవారం నుంచి వరల్డ్ ఫేమస్ లవర్ థియేటర్లలో ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ఈ సినిమాకు వచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి.

నైజాం – రూ. 2.01 కోట్లు
సీడెడ్ – రూ. 0.39 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.52 కోట్లు
ఈస్ట్ – రూ. 0.30 కోట్లు
వెస్ట్ – రూ. 0.20 కోట్లు
గుంటూరు – రూ. 0.43 కోట్లు
నెల్లూరు – రూ. 0.18 కోట్లు
కృష్ణా – రూ. 0.25 కోట్లు