Telugu Global
International

కరోనా ఎఫెక్ట్... చైనాకే కాదు ప్రపంచానికే ప్రమాదం

ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందంటే ఇదే మరీ.. ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ చైనాకే కాదు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే పెనుముప్పుగా మారిందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనాలో సోకిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్నే గజగజలాడిస్తోంది. కరోనా వైరస్ పేరు చెబితేనే ప్రపంచ మార్కెట్లన్నీ కుదేలవుతున్నాయి. ఇప్పటికే కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఢీలా పడింది. ముఖ్యంగా చైనా ఆర్థిక వ్యవస్థపై కరోనా ఎఫెక్ట్ తీవ్రంగా ఉండబోతోంది. ప్రస్తుతం చైనా ప్రపంచ […]

కరోనా ఎఫెక్ట్... చైనాకే కాదు ప్రపంచానికే ప్రమాదం
X

ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందంటే ఇదే మరీ.. ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ చైనాకే కాదు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే పెనుముప్పుగా మారిందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనాలో సోకిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్నే గజగజలాడిస్తోంది.

కరోనా వైరస్ పేరు చెబితేనే ప్రపంచ మార్కెట్లన్నీ కుదేలవుతున్నాయి. ఇప్పటికే కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఢీలా పడింది. ముఖ్యంగా చైనా ఆర్థిక వ్యవస్థపై కరోనా ఎఫెక్ట్ తీవ్రంగా ఉండబోతోంది.

ప్రస్తుతం చైనా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బలియమైన శక్తిగా ఉంది. కరోనా ప్రభావంతో చైనా ఆర్థిక వ్యవస్థ కుదేలైతే ఆ ప్రభావం ప్రపంచ దేశాలపై ఉంటుంది. కరోనా ఎఫెక్ట్ తో ఇప్పటికే చైనా జీడీపీ కొంతమేర తగ్గింది. కరోనా ప్రభావం… 2003లో చైనాలో వచ్చిన సార్స్ వైరస్ కంటే అధికంగా ఉండటంతో చైనాతోపాటు ప్రపంచ దేశాలపై ఈ ప్రభావం పడనుంది.

గతంలో చైనాలో సోకిన సార్స్ వైరస్ వల్ల చైనా జీడీపీ బాగా తగ్గిపోయింది. సార్స్ వైరస్ వల్ల లగ్జరీ ఉత్పత్తులు, కార్లు, టూరిజం, వస్తువుల దిగుమతి, ఎగుమతి రంగాలపై ప్రభావం చూపింది. నాడు చైనా జీడీపీ ప్రపంచ జీడీపీలో 4శాతం ఉంది. నేడు చైనా జీడీపీ ప్రపంచ జీడీపీలో 16శాతంగా ఉంది.

ఈ పరిస్థితుల్లో చైనా జీడీపీ దెబ్బతింటే ఆ ప్రభావం ప్రపంచ దేశాలపై ఖచ్చితంగా పడుతుంది. దీంతో ప్రపంచ దేశాలన్నీ ఆందోళన చెందుతున్నాయి. అప్పట్లో సార్స్ వైరస్ 8వేల మందికి సోకితే 774మంది మృతిచెందారు.

తాజాగా వచ్చిన కరోనా వైరస్ 34వేల మందికి సోకిందని, దాదాపు వెయ్యిమంది మృతిచెందినట్లు తెలుస్తోంది. ఈ లెక్క ఇంకా పెరగనుందని సమాచారం. అలాగే చైనాతోపాటు 25దేశాల్లో ఈ ప్రభావం ఉంది. దీంతో ఆయా దేశాల్లో కరోనా ప్రభావం తప్పక ఉంటుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కరోనా వైరస్ ప్రభావం ముఖ్యంగా చైనాలోని లాజిస్టిక్ పై పడింది. నూతన సంవత్సరంలో మూతబడిన పరిశ్రమలు ఇంకా తెరుచుకోలేదు. దీంతో క్రమేపీ చైనా నుంచి వచ్చే ముడిసరుకులపై ప్రభావం పడింది.

అలాగే విమాన, రోడ్డు, నౌకయానంలో సరఫరా అయ్యే వస్తువులపై ప్రభావం పడింది. అలాగే వాహన రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఈ ప్రభావం చైనా జీడీపీపై పడింది. కరోనా ఎఫెక్ట్ చైనాలోని ఆటోరంగంపై పడింది.

ఇటీవల గ్రేటర్ నోయిడాలో నిర్వహించిన ఆసియా అతిపెద్ద వాహన ప్రదర్శనకు వీక్షకులు, కంపెనీలు కరువయ్యాయి. దీనిబట్టి ఆ రంగంపై కరోనా ఎఫెక్ట్ ఏమేరకు ఉందో తెలుసుకోవచ్చు.

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనా దెబ్బతింటే ఆ ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్ కు త్వరగా మందును కనుక్కొంటే కొంతమేర ఈ ప్రభావాన్ని తగ్గించవచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

First Published:  16 Feb 2020 3:46 AM GMT
Next Story