బాలీవుడ్ లో మళ్లీ హిట్టయిన సాహో

ప్రభాస్ హీరోగా నటించిన సాహో సినిమా బాలీవుడ్ లో పెద్ద హిట్టయింది. ఇప్పుడా సినిమా బుల్లితెరపై కూడా సూపర్ హిట్టయింది. ఈ చిత్రాన్ని జన‌వ‌రి 26న హిందీ వెర్షన్ ను టెలివిజ‌న్ ప్రీమియ‌ర్ చేశారు. గ‌త సంవ‌త్స‌రం లో డిసెంబ‌ర్ 8న నెట్‌ఫ్లిక్స్ ఒటిటి లో విడుద‌ల చేశారు. బ్రాడ్‌కాస్ట్ ఆడియ‌న్స్ రీసెర్చ్ కౌన్సిల్ వారు సాహో చిత్రం 128.20 ల‌క్ష‌ల మంది వ్యూవ‌ర్స్ ఇంప్రెష‌న్స్ వ‌చ్చాయ‌ని అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేశారు. రీసెంట్ గా టెలికాస్ట్ అయిన కాలి కా క‌రిష్మా, పొలిస్ ఔర్ టైగ‌ర్‌, సింభా, కెజిఫ్ ఛాప్ట‌ర్‌1 చిత్రాల్ని సాహో అధిగ‌మించ‌టం ప్రభాస్ క్రేజ్ ని తెలియ‌జేస్తుంది.

తాజా టీఆర్పీలతో నార్త్ లో ప్రభాస్ స్టామినా ఏంటనేది మరోసారి ఎలివేట్ అయింది. అయితే ఆశ్చర్యకరమైన, బాధాకరమైన విషయం ఏంటంటే.. ఈ సినిమా తెలుగు శాటిలైట్ రైట్స్ ఇప్పటివరకు అమ్ముడుపోలేదు. తెలుగులో సాహో సినిమా ఫ్లాప్ అయింది. దీంతో ఈ మూవీ రైట్స్ కొనడానికి ఎవ్వరూ ముందుకురాలేదు. పైగా అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో ఆల్రెడీ సినిమాను పెట్టేయడంతో.. శాటిలైట్ తీసుకోవడానికి ఛానెల్స్ మొగ్గుచూపలేదు.

ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఓ డియర్ అనే సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమాను కూడా తెలుగు-హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. సాహో అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని, ఈసారి రిలీజ్ కు ముందే శాటిలైట్ డీల్ ను పూర్తిచేయాలని మేకర్స్ భావిస్తున్నారు.