మార్కెట్ పెంచుకున్న సాయితేజ్

ఓ హీరోకు మార్కెట్ పెరిగిందా లేదా అనే విషయం ఎలా తెలుస్తుంది. సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ తో పాటు శాటిలైట్ బిజినెస్ దీనికి కొలమానంగా మారింది. సినిమా-సినిమాకు శాటిలైట్ మార్కెట్ పెరుగుతుందంటే ఆ హీరోకు మార్కెట్ పెరిగినట్టే. సాయితేజ్ విషయంలో ఇది రుజువైంది. చిత్రలహరి ముందు వరకు సాయితేజ్ సినిమాలు కొనడానికి కూడా ఆలోచించాయి ఛానెళ్లు. కానీ ఇప్పుడు అతడు బుల్లితెరపై హాట్ కేక్.

సెట్స్ పై ఉంటుండగానే సాయితేజ్ సినిమా శాటిలైట్ పూర్తయింది. అదే సోలో బ్రతుకే సో బెటర్. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా వస్తున్న ఈ సినిమా మే 1న రిలీజ్ కానుంది. ప్రీ-రిలీజ్ బిజినెస్ ఇంకా స్టార్ట్ చేయలేదు. అంతలోనే శాటిలైట్ పూర్తిచేశారు. జీ తెలుగు ఛానెల్ ఈ సినిమా రైట్స్ ను దక్కించుకుంది.

నిజానికి సోలో బ్రతుకే సో బెటరు సినిమాకు సుబ్బు అనే ఓ కొత్త వ్యక్తి దర్శకుడు. ఇలాంటి కొత్త దర్శకుడి సినిమాకు శాటిలైట్ మార్కెట్ జరగదు. కానీ ఈ సినిమాకు శాటిలైట్ డీల్ పూర్తయిందంటే దానికి కారణం సాయితేజ్ కు పెరిగిన మార్కెట్. తాజాగా ఈ సినిమాకు సంబంధించి కాన్సెప్ట్ వీడియో రిలీజ్ చేశారు. అది బాగా క్లిక్ అయింది. దీంతో ఇటు మేకర్స్ తో పాటు అటు శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న ఛానెల్ కూడా హ్యాపీ.