Telugu Global
Cinema & Entertainment

హర్భజన్ సింగ్ సినిమాలో... యాక్షన్ కింగ్

తన స్పిన్ బౌలింగ్‌తో టీమ్‌ ఇండియాకు ఎన్నో అద్బుతమైన విజయాలను అందించడంలో విశేష కృషి చేసిన ప్ర‌ముఖ క్రికెట‌ర్‌ హర్భజన్ సింగ్ తన సుదీర్ఘ క్రికెట్ జీవితానికి గుడ్ బై చెప్పి ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ కు సిద్దం అయ్యారు. పలు కంపెనీలను ప్రమోట్ చేయడం కోసం కెమెరా ముందుకు వచ్చిన హర్భజన్ సింగ్ ఈసారి ‘ఫ్రెండ్ షిప్` సినిమాలో హీరోగా న‌టిస్తున్నారు. త‌మిళ బిగ్ బాస్ ఫేమ్ లోస్లియా మ‌రియ‌నేస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ […]

హర్భజన్ సింగ్ సినిమాలో... యాక్షన్ కింగ్
X

తన స్పిన్ బౌలింగ్‌తో టీమ్‌ ఇండియాకు ఎన్నో అద్బుతమైన విజయాలను అందించడంలో విశేష కృషి చేసిన ప్ర‌ముఖ క్రికెట‌ర్‌ హర్భజన్ సింగ్ తన సుదీర్ఘ క్రికెట్ జీవితానికి గుడ్ బై చెప్పి ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ కు సిద్దం అయ్యారు. పలు కంపెనీలను ప్రమోట్ చేయడం కోసం కెమెరా ముందుకు వచ్చిన హర్భజన్ సింగ్ ఈసారి ‘ఫ్రెండ్ షిప్' సినిమాలో హీరోగా న‌టిస్తున్నారు.

త‌మిళ బిగ్ బాస్ ఫేమ్ లోస్లియా మ‌రియ‌నేస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రానికి జాన్ పాల్ రాజ్‌, శ్యామ్ సూర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సీన్‌టొ స్టూడియోస్‌, సినీ మాస్ స్టూడియోస్ ప‌తాకాల‌పై జెపిఆర్ & స్టాలిన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో యాక్షన్ కింగ్ అర్జున్ నటిస్తున్నట్టు తెలిపింది చిత్ర యూనిట్.

ఈ చిత్రాన్ని పలు భార‌తీయ‌ భాషల్లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్ల‌డించనున్నారు. వేగంగా చిత్రీక‌ర‌ణ పూర్తి చేసి ఏడాది సమ్మర్ స్పెష‌ల్‌గా విడుద‌ల‌చేయ‌నుంది చిత్ర యూనిట్‌.

First Published:  18 Feb 2020 1:57 AM GMT
Next Story