Telugu Global
National

ఏపీ నిఘా బాస్‌గా స్టీఫెన్ ర‌వీంద్ర‌... పోస్టింగ్‌కు లైన్ క్లియ‌ర్

స్టీఫెన్ ర‌వీంద్ర‌. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా రేపోమాపో రాబోతున్నారు. ఆయ‌న పోస్టింగ్‌కు లైన్ క్లియ‌ర్ అయింది. ఏపీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన వెంట‌నే నిఘా విభాగం అధికారిగా స్టీఫెన్ ర‌వీంద్ర పేరు వినిపించింది. అన్న‌ట్లుగానే ఆయ‌న వెళ్లి జ‌గ‌న్‌ను క‌లిశారు. మూడు నెల‌ల పాటు అక్క‌డ ఉన్నారు. తీరా చూస్తే డిప్యూటేష‌న్‌కు కేంద్రం ఒకే చెప్ప‌లేదు. దీంతో ఆయ‌న తిరిగి వ‌చ్చి తెలంగాణ కేడ‌ర్‌లో చేరారు. ప్ర‌స్తుతం ఐజీ ర్యాంక్ హోదాలో హైద‌రాబాద్‌లో ప‌నిచేస్తున్నారు. ఇటీవ‌ల ఢిల్లీ […]

ఏపీ నిఘా బాస్‌గా స్టీఫెన్ ర‌వీంద్ర‌... పోస్టింగ్‌కు లైన్ క్లియ‌ర్
X

స్టీఫెన్ ర‌వీంద్ర‌. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా రేపోమాపో రాబోతున్నారు. ఆయ‌న పోస్టింగ్‌కు లైన్ క్లియ‌ర్ అయింది.

ఏపీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన వెంట‌నే నిఘా విభాగం అధికారిగా స్టీఫెన్ ర‌వీంద్ర పేరు వినిపించింది. అన్న‌ట్లుగానే ఆయ‌న వెళ్లి జ‌గ‌న్‌ను క‌లిశారు. మూడు నెల‌ల పాటు అక్క‌డ ఉన్నారు. తీరా చూస్తే డిప్యూటేష‌న్‌కు కేంద్రం ఒకే చెప్ప‌లేదు. దీంతో ఆయ‌న తిరిగి వ‌చ్చి తెలంగాణ కేడ‌ర్‌లో చేరారు. ప్ర‌స్తుతం ఐజీ ర్యాంక్ హోదాలో హైద‌రాబాద్‌లో ప‌నిచేస్తున్నారు.

ఇటీవ‌ల ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం జ‌గ‌న్‌…కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను క‌లిశారు. అప్పుడు స్టీఫెన్ డిప్యూటేష‌న్ విష‌యం మాట్లాడారు. అమిత్ షా సానుకూలంగా స్పందించారు. త్వ‌ర‌లోనే ఫార్మాలిటీస్ పూర్తి చేయ‌నున్నారు. దీంతో స్టీఫెన్ ర‌వీంద్ర ఏపీకి వెళ్ల‌డం ఖాయ‌మైంది.

చంద్ర‌బాబు హాయంలో ఉన్న అధికారులు డిప్యూటేష‌న్‌పై కేంద్ర స‌ర్వీసుల‌కు వెళ్లారు. మ‌రికొంత మంది హైద‌రాబాద్‌లోనే ఉండిపోయారు. కానీ జ‌గ‌న్ రాగానే ఇన్నాళ్లు లూప్‌లైన్‌కు పరిమిత‌మైన అధికారులు.. ఇప్పుడు లైమ్‌ లైట్‌లోకి వ‌స్తున్నారు. స‌మ‌ర్ధ‌వంత‌గా ప‌నిచేసే ఈ అధికారుల‌ను జ‌గ‌న్ వినియోగించుకుంటే..మంచి ఫ‌లితాలు రాబ‌ట్ట‌వ‌చ్చు.

First Published:  17 Feb 2020 9:01 PM GMT
Next Story