ఆసియా కుస్తీ సమరానికి అంతా రెడీ

  • కరోనా వైరస్ తో చైనా వస్తాదుల దూరం

న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న 2020 ఆసియాకుస్తీ చాంపియన్షిప్ కు చైనా వస్తాదులు దూరంగా ఉండాలని నిర్ణయించుకొన్నారు. కరోనా వైరస్ కారణంగా చైనాజట్టు.. తనకుతానుగా టోర్నీలో పాల్గొనరాదని నిర్ణయించింది.

మరోవైపు…భారతజట్లకు భజరంగ్ పూనియా, వినేశ్ పోగట్ పురుషుల, మహిళల విభాగాలలో భారతజట్లకు నాయకత్వం వహిస్తున్నారు.

పురుషుల 65 కిలోల విభాగంలో భజరంగ్ పూనియా టైటిల్ నిలుపుకోడం కోసం బరిలోకి దిగుతుంటే…ఆసియా కాంస్య విజేత వినేశ్ పోగట్…బంగారు పతకమే లక్ష్యంగా పోటీకి దిగుతోంది.

ఆరురోజులపాటు జరిగే ఈ పోటీలను కేడీ జాదవ్ కుస్తీ స్టేడియం వేదికగా నిర్వహిస్తున్నారు. టోక్యో ఒలింపిక్స్ కు సన్నాహకంగా జరుగుతున్న ఈ టోర్నీలో పాల్గొంటున్న భారత ఇతర వస్తాదులలో దీపక్ పూనియా, రవి కుమార్ దహియా, సాక్షీ మాలిక్, అన్షు మాలిక్, అషు, సోనమ్ మాలిక్ ఉన్నారు.

ఆతిథ్య భారత్ మొత్తం 30 మంది సభ్యులజట్టుతో పురుషుల ఫ్రీ-స్టయిల్, గ్రీకో-రోమన్, మహిళల విభాగాలలో పోటీకి దిగుతోంది.

2017 ఆసియా కుస్తీ పోటీలకు తొలిసారిగా ఆతిథ్యమిచ్చిన భారత్ మూడేళ్ల వ్యవధిలో రెండోసారి ఆతిథ్యమివ్వనుంది.
నలుగురు సభ్యుల పాక్ జట్టుకు భారత్ వీసాలు జారీ చేసింది. మరోవైపు 40 మంది సభ్యుల చైనా బృందానికి కరోనావైరస్ కారణంగా భారత ప్రభుత్వం వీసాలు నిరాకరించింది.