Telugu Global
National

ఆమ్ ఆద్మీ బానే ఉంది.... బీజేపీ బానే ఉంది... కాంగ్రెస్సే రగులుతోంది

ఢిల్లీ శాసనసభకు జరిగిన ఎన్నికలు కాంగ్రెస్ లో చిచ్చు రేపుతున్నాయి. లేని పోని సమస్యలు తెచ్చి పెడుతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచిన ఆమ్ ఆద్మీ సంతోషంగానే ఉంది.. సింగిల్ డిజిట్ కే పరిమితమైన బీజేపీ కూడా బాగానే ఉంది. ఎటొచ్చీ.. కాంగ్రెస్ పార్టీ నేతల మధ్యే ఈ ఎన్నికలు, వాటి ఫలితాలు… కొత్త చిచ్చును సృష్టిస్తున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు రాగానే.. కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరం ఆప్ విజయాన్ని ప్రశంసించారు. కాంగ్రెస్ ఓటమి […]

ఆమ్ ఆద్మీ బానే ఉంది.... బీజేపీ బానే ఉంది... కాంగ్రెస్సే రగులుతోంది
X

ఢిల్లీ శాసనసభకు జరిగిన ఎన్నికలు కాంగ్రెస్ లో చిచ్చు రేపుతున్నాయి. లేని పోని సమస్యలు తెచ్చి పెడుతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచిన ఆమ్ ఆద్మీ సంతోషంగానే ఉంది.. సింగిల్ డిజిట్ కే పరిమితమైన బీజేపీ కూడా బాగానే ఉంది. ఎటొచ్చీ.. కాంగ్రెస్ పార్టీ నేతల మధ్యే ఈ ఎన్నికలు, వాటి ఫలితాలు… కొత్త చిచ్చును సృష్టిస్తున్నాయి.

ఈ ఎన్నికల ఫలితాలు రాగానే.. కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరం ఆప్ విజయాన్ని ప్రశంసించారు. కాంగ్రెస్ ఓటమి గురించి మాట కూడా మాట్లాడలేదు. బీజేపీ ఓటమి గురించే మాట్లాడారు. ఇది.. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ కుమార్తె, కాంగ్రెస్ మహిళా విభాగం చీఫ్ అయిన షర్మిష్ట ముఖర్జీకి ఆగ్రహం కలిగించింది. దుకాణం మూసేద్దామా చిదంబరం జీ.. అంటూ ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది.

తాజాగా.. కాంగ్రెస్ యువ నాయకుడు మిలింద్ దేవ్ రా.. ఆమ్ ఆద్మీ విజయాన్ని ఆకాశానికి ఎత్తారు. కేజ్రీవాల్ చేసిన మంచి పనులు అంటూ.. ఓ పద్దుల చిట్టాను ట్వీట్ చేశారు. ఢిల్లీ ఆదాయాన్ని డబుల్ చేశారంటూ ప్రశంసించారు. ఇది చదివిన సీనియర్ నాయకుడు అజయ్ మాకెన్.. కాస్త తీవ్రంగానే స్పందించారు. అవసరమైతే పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోవచ్చంటూ మిలింద్ కు చురకలు అంటించారు. ఇలాంటి ప్రచారాలు చేయవద్దని పార్టీ పరంగా హితవు పలికారు.

ఇదంతా చూస్తుంటే.. అసలు కాంగ్రెస్ పరిస్థితి ఎందుకిలా తయారైందన్న ప్రశ్నే.. అందరిలో మెదులుతోంది. విధిలేని పరిస్థితుల్లో సోనియా గాంధీ మళ్లీ అధ్యుక్షురాలిగా పగ్గాలు చేపట్టినా.. పార్టీ రాత మారకపోడవం ఆ పార్టీలో నైరాశ్యాన్ని పెంచుతోంది. ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కూడా.. శ్రేణులను అయోమయానికి గురి చేస్తున్నాయి. ఇంకెంత కాలం ఇలా.. అన్న ప్రశ్న కేడర్ నుంచి వ్యక్తమవుతోంది.

First Published:  18 Feb 2020 12:05 AM GMT
Next Story