Telugu Global
NEWS

ఆయ‌న్ని కేసీఆర్ పెద్ద‌ల స‌భ‌కు పంపిస్తారా?

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి. కేసీఆర్ సీఎం అయిన త‌ర్వాత నుంచి ఆయ‌న ద‌గ్గ‌ర ప‌నిచేస్తున్నారు. ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శిగా కీల‌క బాధ్య‌త‌లు చూస్తున్నారు. కేంద్ర కార్మికశాఖ మంత్రిగా ఉన్న‌ప్ప‌టినుంచి కేసీఆర్‌తో ఆయ‌నకు ప‌రిచ‌యం ఉంది. హైదరాబాద్ పీఎఫ్ రీజినల్ కమిషనర్ గా ఉన్న ఆయన తెలంగాణ ఆవిర్భావం నాటి నుంచి స్పెషల్ సెక్రటరీగా సీఎం కేసీఆర్ కు కొనసాగుతున్నారు. కేంద్ర సర్వీసుల నుంచి డిప్యూటేషన్ పై ఆరేళ్లుగా తెలంగాణ సీఎంవోలో ఉన్నారు. ఈ మ‌ధ్యే […]

ఆయ‌న్ని కేసీఆర్ పెద్ద‌ల స‌భ‌కు పంపిస్తారా?
X

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి. కేసీఆర్ సీఎం అయిన త‌ర్వాత నుంచి ఆయ‌న ద‌గ్గ‌ర ప‌నిచేస్తున్నారు. ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శిగా కీల‌క బాధ్య‌త‌లు చూస్తున్నారు. కేంద్ర కార్మికశాఖ మంత్రిగా ఉన్న‌ప్ప‌టినుంచి కేసీఆర్‌తో ఆయ‌నకు ప‌రిచ‌యం ఉంది.

హైదరాబాద్ పీఎఫ్ రీజినల్ కమిషనర్ గా ఉన్న ఆయన తెలంగాణ ఆవిర్భావం నాటి నుంచి స్పెషల్ సెక్రటరీగా సీఎం కేసీఆర్ కు కొనసాగుతున్నారు. కేంద్ర సర్వీసుల నుంచి డిప్యూటేషన్ పై ఆరేళ్లుగా తెలంగాణ సీఎంవోలో ఉన్నారు. ఈ మ‌ధ్యే ఆయన ఉన్నట్టుండి వాలెెంటరీ రిటైర్మెంట్ కు అప్లై చేయడం, ఆయన అర్జీని పీఎఫ్ కమిషనర్ ఆమోదించండం చకచక జరిగిపోయింది.

ముఖ్యమంత్రి కేసీఆర్ కు పర్సనల్ సెక్రటరీగా పని చేస్తున్న పి.రాజశేఖర్ రెడ్డికి ఇంకా చాలా సర్వీస్ ఉంది. అలాంటి వ్యక్తి ఊహించని విధంగా ఉద్యోగాన్ని వదలడం ఏంటన్న ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది. అయితే రాజకీయాల్లోకి వచ్చేందుకే వీఆర్ఎస్ తీసుకున్నట్లుగా సీఎంవో వర్గాలు కోడై కూస్తున్నాయి. పి.రాజశేఖర్ రెడ్డికి త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో నిలబెట్టి పెద్దల సభకు పంపుతారా?? అనే సందేహం రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది.

మాజీ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శులు రాజీవ్ శ‌ర్మ‌, సీకే జోషి ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత ప్ర‌భుత్వ స‌ల‌హాదారులుగా కేసీఆర్ నియ‌మించారు. దీంతో రాజ‌శేఖ‌ర్‌ను కూడా ప్ర‌త్యేక స‌ల‌హాదారుగా సీఎంవోలో నియ‌మించే అవ‌కాశం కూడా ఉంది.

మొత్తానికి కేంద్ర స‌ర్వీస్‌లో ఉన్న‌వారిని ఐదేళ్లకు మించి డిప్యూటేష‌న్‌పై కొన‌సాగించేందుకు కేంద్రం ఒప్పుకోదు. ఐదేళ్ల స‌ర్వీసు పూర్తి కావ‌డంతోనే రాజ‌శేఖ‌ర్ తెలంగాణ‌లో కొన‌సాగేందుకు వీలుగా ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన‌ట్లు తెలుస్తోంది. దీంతో ఆయ‌న్ని రాజ్య‌స‌భ‌కు పంపిస్తారా? లేక సీఎంవోలోనే కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గిస్తారా? అనేది చూడాలి.

First Published:  17 Feb 2020 8:55 PM GMT
Next Story