Telugu Global
National

ఇండియన్ బోల్ట్ స్పందించాడు... కాస్త టైమ్ కావాలంటున్నాడు

కన్నడ సంప్రదాయ క్రీడ కంబళలో.. దున్నపోతులతో కలిసి వేగంగా పరిగెత్తి.. ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు శ్రీనివాస గౌడ. 100 మీటర్లను కేవలం 9.55 సెకన్లలోనే పూర్తి చేసి సంచలనం సృష్టించాడు. జమైకా రన్నర్ ఉసేన్ బోల్ట్ సృష్టించిన 9.58 సెకన్ల రికార్డును తిరగరాసినా.. కంబళ క్రీడకు అంతర్జాతీయ గుర్తింపు లేని కారణంగా.. ఆ ఖ్యాతిని దక్కించుకోలేకపోయాడు. అయినా సరే.. అందరి దృష్టిని ఆకర్షించి.. ఎవరికీ సాధ్యం కాని ఖ్యాతి పొందాడు. ఓవర్ నైట్ లో స్టార్ అయిన […]

ఇండియన్ బోల్ట్ స్పందించాడు... కాస్త టైమ్ కావాలంటున్నాడు
X

కన్నడ సంప్రదాయ క్రీడ కంబళలో.. దున్నపోతులతో కలిసి వేగంగా పరిగెత్తి.. ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు శ్రీనివాస గౌడ. 100 మీటర్లను కేవలం 9.55 సెకన్లలోనే పూర్తి చేసి సంచలనం సృష్టించాడు. జమైకా రన్నర్ ఉసేన్ బోల్ట్ సృష్టించిన 9.58 సెకన్ల రికార్డును తిరగరాసినా.. కంబళ క్రీడకు అంతర్జాతీయ గుర్తింపు లేని కారణంగా.. ఆ ఖ్యాతిని దక్కించుకోలేకపోయాడు. అయినా సరే.. అందరి దృష్టిని ఆకర్షించి.. ఎవరికీ సాధ్యం కాని ఖ్యాతి పొందాడు.

ఓవర్ నైట్ లో స్టార్ అయిన శ్రీనివాసగౌడ ఘనతపై.. కేంద్ర క్రీడల శాఖ కూడా స్పందించింది. అతనికి పరుగు పందేలకు సంబంధించిన ట్రయల్స్ నిర్వహించాలని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాను ఆదేశించింది. దీనిపై స్పందించిన ఇండియన్ బోల్ట్ గౌడ.. ఇప్పటికిప్పుడు తాను ట్రయల్స్ కు హాజరు కాబోనని తెలిపాడు. నెల రోజులైనా సమయం కోరతానని చెప్పాడు. తనకు కంబళ క్రీడలో మరిన్ని ఘనతలు సాధించాలని ఉందని అన్నాడు.

మరో విషయాన్ని విశ్లేషణాత్మకంగా చెప్పాడు శ్రీనివాసగౌడ. అథ్లెటిక్స్ పాల్గొనే ట్రాక్, కంబళ ట్రాక్ వేర్వేరుగా ఉంటాయని.. కంబళలో మడమలపై పరిగెత్తితే.. అథ్లెటిక్స్ లో వేళ్లపై పరిగెత్తాల్సి ఉంటుందన్నాడు. అందుకే.. సంప్రదాయ క్రీడల్లో రాణించేవారు అథ్లెటిక్స్ లో… అథ్లెటిక్స్ లో రాణించేవారు సంప్రదాయ క్రీడల్లో రాణించే అవకాశాలు తక్కువ అని విశ్లేషించాడు. తనను బోల్ట్ తో పోలుస్తున్న విషయంపై స్పందిస్తూ.. అతను ప్రపంచ చాంపియన్ అని.. తాను బురదలో పరిగెత్తే వాడినని చెప్పాడు. బోల్ట్ పై ఉన్న ప్రేమను ఇలా చాటుకుని.. ప్రశంసలు అందుకున్నాడు.

ఇక.. ఇప్పటికిప్పుడు ట్రయల్స్ కు హాజరు కాలేకున్నా.. తర్వాత అయినా సరే.. శ్రీనివాస గౌడ అథ్లెటిక్స్ లో దేశ జెండాను అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడించాలని అంతా కాంక్షిస్తున్నారు.

First Published:  17 Feb 2020 10:00 PM GMT
Next Story