Telugu Global
NEWS

జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.... యువతకెంతో ఉపయోగం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనలో సంస్కరణల దిశగా.. మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టల సామెతను తన చేతలతో చూపిస్తూ.. యువతను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 30 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసి పారిశ్రామిక అవసరాలకు తగినట్టు నిపుణులుగా తయారుచేసేందుకు సంకల్పించింది. వీటి పర్యవేక్షణకు ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్.. అధికారులను ఆదేశించారు. ఐటీ, నైపుణ్యాభివృద్ధి రంగాల సమీక్ష సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కేంద్రాల ఏర్పాటుకు […]

జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.... యువతకెంతో ఉపయోగం
X

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనలో సంస్కరణల దిశగా.. మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టల సామెతను తన చేతలతో చూపిస్తూ.. యువతను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది.

రాష్ట్ర వ్యాప్తంగా 30 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసి పారిశ్రామిక అవసరాలకు తగినట్టు నిపుణులుగా తయారుచేసేందుకు సంకల్పించింది. వీటి పర్యవేక్షణకు ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్.. అధికారులను ఆదేశించారు. ఐటీ, నైపుణ్యాభివృద్ధి రంగాల సమీక్ష సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ కేంద్రాల ఏర్పాటుకు ఉన్నతమైన ప్రణాళికనూ ప్రాథమికంగా ప్రభుత్వం రూపొందించింది. ఐటీ రంగంలో అత్యున్నత నైపుణ్యవంతులుగా యువతను తీర్చి దిద్దేందుకు విశాఖపట్నంలో ఓ సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇంజినీరింగ్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రవేశాలు కల్పిస్తారు. తర్వాత ఈ కేంద్రానికి అనుబంధంగా.. సెంట్రల్ ఆంధ్రా, రాయలసీమల్లోనూ వీటి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ఫోకస్ ఏర్పడేలా అవకాశాలు కల్పిస్తారు. వారి ఎదుగుదలతో పాటు రాష్ట్ర అభివృద్ధిని భాగం చేస్తారు.

నైపుణ్యాభివృద్ధి కేంద్రాల విషయానికి వస్తే.. ప్రతి లోక్ సభ నియోజకవర్గానికి ఓ కేంద్రంతో పాటు.. రాష్ట్రంలోని 4 ట్రిపుల్ ఐటీలకు 4 కేంద్రాలు.. పులివెందుల ట్రిపుల్ ఐటీకి అదనంగా మరోటి.. మొత్తంగా 30 కేంద్రాలు ఏర్పాటు చేసి యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.

మారుమూల ప్రాంతాల విద్యార్థుల ప్రతిభను గుర్తించి.. సానపెట్టి వారికి అత్యున్నత స్థాయి అవకాశాలు కల్పించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. విద్యాశాఖను ఇందులో భాగం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈ కార్యక్రమాల అమలుకు.. మంత్రి గౌతమ్ రెడ్డి నేతృత్వంలో కమిటీ వేసి.. నిపుణులకు సభ్యులుగా చోటు ఇవ్వాలని కూడా అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.

First Published:  17 Feb 2020 9:07 PM GMT
Next Story