Telugu Global
NEWS

‘కొత్తవి తేవాలని చూస్తున్నాం... ఉన్నవాటిని ఎందుకు వెళ్లగొడతాం?’

విశాఖలో ఐటీ సంస్థల విషయంలో టీడీపీ నేతలు ఇటీవల చేస్తున్న ఆరోపణలపై మంత్రి గౌతం రెడ్డి స్పందించారు. తాము ఈ ఏడాది విశాఖలో 50 వేల ఐటీ ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా పని చేస్తున్నట్టు స్పష్టం చేశారు. కొత్త సంస్థలు తేవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. ఉన్న సంస్థలను అనవసరంగా ఎందుకు వెళ్లగొడతామని మంత్రి ప్రశ్నించారు. ఐటీ సంస్థలు వెళ్లిపోవాలంటూ సచివాలం పేరిట ఆదేశాలు జారీ అయ్యాయని వస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. అదాని డేటా సెంటర్ విషయంలోనూ తప్పుడు […]

‘కొత్తవి తేవాలని చూస్తున్నాం... ఉన్నవాటిని ఎందుకు వెళ్లగొడతాం?’
X

విశాఖలో ఐటీ సంస్థల విషయంలో టీడీపీ నేతలు ఇటీవల చేస్తున్న ఆరోపణలపై మంత్రి గౌతం రెడ్డి స్పందించారు. తాము ఈ ఏడాది విశాఖలో 50 వేల ఐటీ ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా పని చేస్తున్నట్టు స్పష్టం చేశారు. కొత్త సంస్థలు తేవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. ఉన్న సంస్థలను అనవసరంగా ఎందుకు వెళ్లగొడతామని మంత్రి ప్రశ్నించారు. ఐటీ సంస్థలు వెళ్లిపోవాలంటూ సచివాలం పేరిట ఆదేశాలు జారీ అయ్యాయని వస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు.

అదాని డేటా సెంటర్ విషయంలోనూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. డేటా సెంటర్లు చాలా అవసరం అన్న మంత్రి… తాము ఎన్నడూ అదానీ సెంటర్ ను మార్చాలని చెప్పనేలేదని స్పష్టం చేశారు. టీడీపీ నేతలే కాదు.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు కూడా… ఇలాంటి ప్రచారాలు మానుకోవాలని కోరారు. విశాఖ కేంద్రంగా ఉద్యోగాల కల్పనతో పాటు స్కిల్ డెవలప్ మెంట్ వర్సిటీ ఏర్పాటుకు జరుగుతున్న చర్యలు పరిశీలించాలని సూచించారు.

స్కిల్ వర్సిటీ ఏర్పాటుపై సీఎం జగన్ తోనూ మాట్లాడామని.. విధి విధానాలపై చర్చించామని.. త్వరలోనే ఖరారవుతాయని విశాఖలో మంత్రి గౌతం రెడ్డి చెప్పారు. రాష్ట్ర విద్యార్థుల నైపుణ్యాలను మార్కెట్ అవసరాలకు తగినట్టుగా మెరుగు పరిచే ప్రక్రియలో భాగంగా.. రాష్ట్ర వ్యాప్తంగా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు కూడా ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు.

ఇప్పటికైనా…. తెలుగుదేశం నేతలు ఇలాంటి ప్రచారాలను ఆపాలని…. అభివృద్ధికి సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

First Published:  18 Feb 2020 8:54 PM GMT
Next Story