Telugu Global
International

ఇది విమానం కాదు.. ఎగిరే వైట్ హౌస్..!

ఇప్పుడు దేశమంతటా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటన గురించిన చర్చే నడుస్తోంది. ఆయన వస్తున్నారని గుజరాత్‌లో మురికి వాడలు కనపడకుండా గోడలు కడుతున్నారనే విమర్శలు.. ఆయన భద్రతకే 100 కోట్లు భారత ప్రభుత్వం ఖర్చు చేస్తోందనే వార్తలు పుంఖానుపుంఖాలుగా మీడియా ప్రసారం చేస్తోంది. అవన్నీ పక్కన పెడితే.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాధ్యక్షుడు తన దేశాన్ని వదిలి వస్తే అక్కడ పాలన ఎలా అనే డౌట్ రావొచ్చు. ఆయన వేరే దేశంలో ఉన్నప్పుడు అమెరికా మీద […]

ఇది విమానం కాదు.. ఎగిరే వైట్ హౌస్..!
X

ఇప్పుడు దేశమంతటా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటన గురించిన చర్చే నడుస్తోంది. ఆయన వస్తున్నారని గుజరాత్‌లో మురికి వాడలు కనపడకుండా గోడలు కడుతున్నారనే విమర్శలు.. ఆయన భద్రతకే 100 కోట్లు భారత ప్రభుత్వం ఖర్చు చేస్తోందనే వార్తలు పుంఖానుపుంఖాలుగా మీడియా ప్రసారం చేస్తోంది.

అవన్నీ పక్కన పెడితే.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాధ్యక్షుడు తన దేశాన్ని వదిలి వస్తే అక్కడ పాలన ఎలా అనే డౌట్ రావొచ్చు. ఆయన వేరే దేశంలో ఉన్నప్పుడు అమెరికా మీద ఎవరైనా ఎటాక్ చేస్తే ఎలా..? ఇలా అనేక అనుమానాలు ఉండొచ్చు. వాటిలో కొన్ని మనం ఇప్పుడు చర్చించుకుందాం.

అమెరికా అధ్యక్షుడు వాషింగ్టన్ నుంచి బయటకు వెళ్లాలంటే ఉపయోగించేది బోయింగ్ 747-200బీ సిరీస్ విమానం. దీనినే అమెరికా వాయుసేన కోడ్ వర్డ్ ‘ఎయిర్ ఫోర్స్ వన్’. ఈ విమానం అనే కాదు.. అమెరికా అధ్యక్షుడు అధికారికంగా ఏ విమానం ఉపయోగిస్తే.. దాన్ని ఎయిర్ ఫోర్స్ వన్‌గా సంబోధిస్తుంటారు. ఇది అన్ని విమానాల్లాగా కాదు. మినీ వైట్ హౌస్‌లా పనిచేస్తుంది. అధ్యక్షుడిగా అన్ని రకాల బాధ్యతలను ఈ విమానం నుంచే చక్కపెట్టవచ్చు. ఈ విమానంపై ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా’ అని రాసి ఉంటుంది. దీంతో పాటు అమెరికా జాతీయ జెండా, అధ్యక్షుడి ముద్ర ఉంటాయి.

ఈ విమానం సుదీర్ఘ సమయం గాలిలోనే ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఇంధనం అయిపోయినా గాలిలోనే నింపుకునే అవకాశం ఈ విమానం ప్రత్యేకత. అధ్యక్షుడు ఈ విమానంలో ఉన్న సమయంలో అమెరికాపై దాడులు జరిగితే.. దీన్నే కమాండ్ సెంటర్‌లా మార్చేస్తారు. అవసరం అయితే ఇక్కడి నుంచే అణు దాడులు చేసే అవకాశం ఉంది. ఈ విమానంలో మూడు లెవెల్స్ ఉంటాయి.

ఒక లెవెల్ పూర్తిగా అధ్యక్షుడు నివాసం, కార్యాలయంలా ఉపయోగిస్తారు. ఇందులోనే కాన్ఫెరెన్స్ హాల్ కూడా ఉంటుంది.

మరో లెవల్ మెడికల్ సెంటర్. ఇందులో ఒక డాక్టర్ ఎప్పుడూ సిద్దంగా ఉంటాడు. సర్జరీలు చేసే ఆపరేషన్ థియేటర్ కూడా ఉంటుంది.

ఇక మూడో లెవెల్‌లో ప్యాంట్రీ కోసం ఉపయోగిస్తారు. ఇందులో ఉండే రెండు కిచెన్స్ ద్వారా 100 మందికి వంట చేసే అవకాశం ఉంది.

ఇక అధ్యక్షుడు, ప్రథమ మహిళ కోసం రెండు క్వార్టర్లు.. సీనియర్ అడ్వైజర్లు, సీక్రెస్ సర్వీస్ అధికారులు, ప్రెస్, ఇతర అధికారుల కోసం ప్రత్యేకంగా క్వార్టర్లు ఉంటాయి. ఈ విమానాన్ని బోయింగ్ కేవలం అధ్యక్షుడి కోసం మాత్రమే ప్రత్యేకంగా తయారు చేసింది. సీక్రెస్ సర్వీసెస్ వాళ్లు అసలు విషయం ఏనాడూ బయటకు చెప్పలేదు కాని.. ఎయిర్ ఫోర్స్ వన్‌ కోసం మొత్తం మూడు విమానాలు ఉన్నాయని.. కాని బయటి ప్రపంచానికి ఒకటే అని భ్రమ కలిగిస్తుంటారని తెలుస్తోంది.

First Published:  19 Feb 2020 10:28 AM GMT
Next Story