Telugu Global
NEWS

చంద్రబాబు భద్రత తగ్గించామన్నది అవాస్తవం...

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడికి భద్రత తగ్గించారంటూ పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయనకు వైసీపీ ప్రభుత్వం కావాలనే భద్రత తగ్గించిందని.. కీలకమైన బస్సు యాత్ర ముందు భద్రత ఎలా తగ్గిస్తారంటూ టీడీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. దీనిపై ఏపీ హోం మంత్రి సుచరిత స్పందించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు భద్రత తగ్గించారన్న ఆరోపణల్లో నిజం లేదని ఆమె స్పష్టం చేశారు. ఆయనకు ఇప్పటి వరకు భద్రత తగ్గించలేదని.. ఇంకా జడ్ ప్లస్ […]

చంద్రబాబు భద్రత తగ్గించామన్నది అవాస్తవం...
X

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడికి భద్రత తగ్గించారంటూ పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయనకు వైసీపీ ప్రభుత్వం కావాలనే భద్రత తగ్గించిందని.. కీలకమైన బస్సు యాత్ర ముందు భద్రత ఎలా తగ్గిస్తారంటూ టీడీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. దీనిపై ఏపీ హోం మంత్రి సుచరిత స్పందించారు.

ప్రతిపక్ష నేత చంద్రబాబుకు భద్రత తగ్గించారన్న ఆరోపణల్లో నిజం లేదని ఆమె స్పష్టం చేశారు. ఆయనకు ఇప్పటి వరకు భద్రత తగ్గించలేదని.. ఇంకా జడ్ ప్లస్ కేటగిరీ భద్రతనే కొనసాగిస్తున్నట్లు ఆమె చెప్పారు.

చంద్రబాబు ఉంటున్న ఉండవల్లి నివాసం వద్ద 135 మంది, హైదరాబాద్ ఇంటి వద్ద 48 మందితో భద్రత కొనసాగిస్తున్నామని సుచరిత చెప్పారు. కాని టీడీపీ నేతలే కావాలని 58 మంది మాత్రమే భద్రతా సిబ్బంది ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారని ఆమె చెప్పారు.

చంద్రబాబు భద్రతకు సంబంధించి టీడీపీ అసత్య ప్రచారాలు చేయడం సబబు కాదని ఆమె హితవు పలికారు. రాష్ట్రంలోని వీఐపీల భద్రతకు సంబంధించి హోం శాఖ ప్రతీ ఆరు నెలలకు ఒకసారి సమీక్ష నిర్వహిస్తోందని.. దాని ప్రకారమే వారి భద్రతా సిబ్బందిని నిర్ణయిస్తుందని ఆమె స్పష్టం చేశారు.

First Published:  19 Feb 2020 9:02 PM GMT
Next Story