వరల్డ్ ఫేమస్ లవర్ ఫ్లాప్ తో విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం

పెళ్లిచూపులు.. అర్జున్ రెడ్డి వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో ఇండస్ట్రీని షేక్ చేసిన విజయ్ దేవరకొండకు వరుసగా ఫ్లాపులు ఎదురవుతున్నాయి. తాజాగా రిలీజ్ అయిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా కూడా ఫ్లాప్ కావడంతో ఇక విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

తన స్టార్ డంను సరితూగే కథ, సీనియర్ దర్శకులతోనే సినిమా తీయాలని డిసైడ్ అయినట్టు తెలిసింది. తాజాగా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ఫ్లాప్ తో తన తదుపరి చిత్రం నుంచి విజయ్ వైదొలగడం సంచలనంగా మారింది.

వరల్డ్ ఫేమస్ లవర్ ఫ్లాప్ తర్వాత విజయ్ ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ఆనంద్ అన్నామలై దర్శకుడు. ఈ సినిమా కథపై నమ్మకం లేకపోవడంతో వైదొలగినట్లు తెలిసింది. దాదాపు 10 కోట్ల వరకూ ఖర్చైన ఈ మూవీ నుంచి విజయ్ వైదొలిగాడట.. ఈ ఖర్చును తాను తిరిగి ఇచ్చేస్తానని.. వేరే సినిమా మీతో చేస్తానని హామీ ఇచ్చాడట.. మంచి కథతో సీనియర్ దర్శకుడితో సినిమా తీద్దామని.. కథ కోసం వెతకాలని మైత్రీ మూవీ మేకర్స్ కు హామీ ఇచ్చాడట..

విజయ్ దేవరకొండ ఎగ్జిట్ తో ప్రస్తుతం ఆనంద్ సినిమాను మధ్యలోనే వదిలేసిన మైత్రీ మేకర్స్ మారుతి, సుజీత్ , ఇంకొందరు సీనియర్ దర్శకులతో కథా చర్చలు జరుపుతున్నారట. ఇలా విజయ్ వరుస ఫ్లాపులతో ఏకంగా సినిమానే వదిలేయడం సంచలనంగా మారింది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ పాన్ ఇండియా మూవీ తీస్తున్నాడు.