Telugu Global
Cinema & Entertainment

'భీష్మ' సినిమా రివ్యూ

రివ్యూ : భీష్మ రేటింగ్ : 2.75/5 తారాగణం : నితిన్, రష్మీక మందన్న, జిష్షు సేన్ గుప్త, అనంత్ నాగ్, వెన్నెల కిషోర్, సత్య, రాజీవ్ కనకాల, సంపత్ రాజ్, బ్రహ్మాజీ, రఘుబాబు, నరేష్ తదితరులు సంగీతం : మహతి స్వర సాగర్ నిర్మాత : సూర్య దేవర నాగ వంశీ దర్శకత్వం : వెంకీ కుడుముల వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న నితిన్… తాజాగా ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు […]

భీష్మ సినిమా రివ్యూ
X

రివ్యూ : భీష్మ
రేటింగ్ : 2.75/5
తారాగణం : నితిన్, రష్మీక మందన్న, జిష్షు సేన్ గుప్త, అనంత్ నాగ్, వెన్నెల కిషోర్, సత్య, రాజీవ్ కనకాల, సంపత్ రాజ్, బ్రహ్మాజీ, రఘుబాబు, నరేష్ తదితరులు
సంగీతం : మహతి స్వర సాగర్
నిర్మాత : సూర్య దేవర నాగ వంశీ
దర్శకత్వం : వెంకీ కుడుముల

వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న నితిన్… తాజాగా ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హ్యాపీనింగ్ బ్యూటీ రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాపైనే నితిన్ తన ఆశలన్నీ పెట్టుకున్నాడు. టీజర్, ట్రైలర్ తోనే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా… సేంద్రియ వ్యవసాయం చుట్టూ తిరుగుతూ ఉంటుంది అని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. మంచి అంచనాల మధ్య ఈ సినిమా ఈరోజు విడుదలైంది.

కథ:

భీష్మ (అనంత్ నాగ్) అనే వ్యక్తి ‘భీష్మ ఆర్గానిక్స్’ అనే ఒక సేంద్రీయ వ్యవసాయానికి సంబంధించిన పెద్ద కంపెనీకి సీఈఓ. అయితే అతని తర్వాత తన కంపెనీని చూసుకోవడానికి సరైన వారసులు ఎవరూ లేకపోవడంతో తన కంపెనీ బాధ్యతలను చూసుకోవడానికి ఒక వారసుడి కోసం వెతుకుతూ ఉంటాడు.

అదే సమయంలో భీష్మ (నితిన్) ను కలుస్తాడు. జూనియర్ భీష్మ బాగా నచ్చడంతో సీనియర్ భీష్మ అతనిని ఒక నెల రోజుల పాటు ఆపరేషనల్ సీఈఓగా అపాయింట్ చేసేస్తాడు. మరి ఈ సమయంలో భీష్మ తన ప్రతిభని ఎలా చాటాడు? చైత్ర (రష్మిక మందన్న) తో తన ప్రేమ కథ ఎలా సాగింది? చివరికి ఏమైంది? అనేది ఈ సినిమా కథ.

నటీనటులు:

ఈ సినిమాపైనే తన ఆశలన్నీ పెట్టుకున్న నితిన్ తన పాత్రకి పూర్తి స్థాయిలో న్యాయం చేశాడు. రొమాంటిక్ సన్నివేశాలలో మాత్రమే కాక యాక్షన్ సన్నివేశాలలో కూడా నితిన్ తనదైన శైలిలో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో రష్మిక మందన్న అందంతో మాత్రమే కాక పర్ఫార్మెన్స్ తో కూడా మంచి మార్కులు వేయించుకుంది.

అనంత్ నాగ్ నటన ఈ సినిమాకి చాలా బాగా ప్లస్ అయింది. జిష్షు సేన్ గుప్తా ఎనర్జిటిక్ పర్ఫామెన్స్ సినిమాకి మరింత బలాన్ని చేకూర్చింది. వెన్నెల కిషోర్, సత్య ల కామెడీ టైమింగ్ చాలా బాగా కుదిరింది. చాలా సన్నివేశాల్లో వీరిద్దరి కామెడీ ప్రేక్షకులని బాగా నవ్విస్తుంది.

ఈ సినిమాలో కూడా మంచి పాత్రలో నటించిన రాజీవ్ కనకాల తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. రఘు బాబు, సంపత్ రాజ్ కూడా తమ పాత్రలలో చాలా బాగా నటించారు. బ్రహ్మాజీ, నరేష్ కూడా తమ పాత్రలలో ఒదిగిపోయి బాగానే నటించారు.

సాంకేతిక వర్గం:

దర్శకుడు వెంకీ కుడుముల ఈ సినిమా కోసం ఒక మంచి కథను ఎంచుకున్నాడు. సేంద్రియ వ్యవసాయం వంటి నేపథ్యం తీసుకున్నప్పటికీ… దర్శకుడు ఈ సినిమాని వీలైనంత ఎంటర్ టైనింగ్ గా మార్చారని చెప్పుకోవాలి. ఎక్కడా బోరు కొట్టించకుండా వెంకీ కుడుముల కథను చాలా బాగా నెరేట్ చేశాడని చెప్పొచ్చు.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ అందించిన నిర్మాణ విలువలు చాలా బాగా ప్లస్ అయ్యాయి. మహతి స్వర సాగర్ అందించిన సంగీతం కూడా ఈ సినిమాకి ప్లస్ పాయింట్ గా నిలిచింది. పాటల సంగతి పక్కన పెడితే మహతి అందించిన నేపథ్య సంగీతం చాలావరకూ సన్నివేశాలను ఎలివేట్ చేసింది.

సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. అతను అందించిన కెమెరా యాంగిల్స్ మరియు విజువల్స్ కూడా చూడ చక్కగా ఉన్నాయి. నవీన్ నూలి ఎడిటింగ్ పర్వాలేదు అనిపిస్తుంది.

బలాలు:

డైరెక్షన్, ఎంటర్ టైన్ మెంట్, డైలాగ్స్, లవ్ ట్రాక్, ఇంటర్వెల్ తర్వాత వచ్చే ట్విస్ట్

బలహీనతలు:

ఎమోషనల్ సన్నివేశాలు, సెకండ్ హాఫ్ లోని కొన్ని స్లో సన్నివేశాలు

చివరి మాట:

ఆసక్తికరంగా మొదలయ్యే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ, రొమాన్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. చాలా వరకు కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. రష్మిక, నితిన్ ల మధ్య వచ్చే లవ్ ట్రాక్ చాలా బాగుంది. అయితే ఇంటర్వెల్ తర్వాత వచ్చే ట్విస్ట్ తో సినిమా కథ పూర్తిగా మారిపోతుంది.

జిష్షు సేన్ గుప్త, నితిన్ మధ్య వైరాన్ని చాలా బాగా మలిచారు. యాక్షన్ సన్నివేశాలను కూడా చాలా బాగా తెరకెక్కించారు. డైలాగులు కూడా సినిమాకి మరింత బలాన్ని చేకూర్చాయి. అయితే సెకండాఫ్ లోని కొన్ని స్లో సన్నివేశాలు మరియు ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలకు ప్రేక్షకులు అంతగా కనెక్ట్ అవ్వకపోవచ్చు.

బాటమ్ లైన్:

తన కథతో బాగానే మెప్పించిన ‘భీష్మ’

First Published:  21 Feb 2020 6:59 AM GMT
Next Story