Telugu Global
NEWS

బాబు, టీడీపీ కొంప ముంచేది అదేనా?

టీడీపీలో ఒక సామాజికవర్గ పోకడతో నేతలు రగిలిపోతున్నారా? వారి ఆధిపత్యంతో ఇది తమ పార్టీ కాదని భావిస్తున్నారా? టీడీపీలో భవిష్యత్ లేదని బీసీ, ఇతర సామాజికవర్గ నేతలు వలస బాట పడుతున్నారా? ఆ కుల ఆధిపత్యం కొనసాగితే టీడీపీకి డేంజర్ బెల్స్ అంటూ నేతలు వాపోతున్నారట. తాజాగా నాయకులు ఒకరి తర్వాత ఒకరు పార్టీని విడిచిపెడుతుంటే కేడర్ మౌనంగా ఉండిపోతుంది. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిని టీడీపీ అందలమెక్కిస్తుందన్న ఆరోపణలు క్షేత్రస్థాయి టీడీపీ నేతల్లో వ్యక్తమవుతున్నాయట. […]

బాబు, టీడీపీ కొంప ముంచేది అదేనా?
X

టీడీపీలో ఒక సామాజికవర్గ పోకడతో నేతలు రగిలిపోతున్నారా? వారి ఆధిపత్యంతో ఇది తమ పార్టీ కాదని భావిస్తున్నారా? టీడీపీలో భవిష్యత్ లేదని బీసీ, ఇతర సామాజికవర్గ నేతలు వలస బాట పడుతున్నారా? ఆ కుల ఆధిపత్యం కొనసాగితే టీడీపీకి డేంజర్ బెల్స్ అంటూ నేతలు వాపోతున్నారట.

తాజాగా నాయకులు ఒకరి తర్వాత ఒకరు పార్టీని విడిచిపెడుతుంటే కేడర్ మౌనంగా ఉండిపోతుంది. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిని టీడీపీ అందలమెక్కిస్తుందన్న ఆరోపణలు క్షేత్రస్థాయి టీడీపీ నేతల్లో వ్యక్తమవుతున్నాయట.

ఇప్పటికే కుటుంబ ఆధిపత్యంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనేక రాష్ట్రాల్లో కనుమరుగైంది. ఇక పాత చింతకాయపచ్చడి విధానాలతో కమ్యూనిస్టులకు కాలం చెల్లింది. కొందరు నేతలు దేశంలో శక్తివంతంగా మారుతున్న బీజేపీలో చేరుతున్నారు.

కాంగ్రెస్ పాలనతో విసుగుచెందిన ప్రజల నాడిని తెలుసుకొని 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం స్థాపించగానే తమ పార్టీగా ఓన్ చేసుకున్నారు. టీడీపీని అనంతరకాలంలో బీసీలు, ఇతర సామాజికవర్గాలు అక్కున చేర్చుకున్నాయి. వీరికి బలమైన చంద్రబాబు సామాజికవర్గంలోని మీడియా కూడా సపోర్టుగా నిలబడింది.

అనంతరం ఎన్టీఆర్ ను హైజాక్ చేసి చంద్రబాబు పార్టీని బలంగా తీర్చిదిద్దారు. బలమైన మీడియాను చేతిలో పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు సామాజికవర్గం లాబీ టీడీపీలో పెరిగిపోయిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీసీలు ఎదగలేకపోతున్నారని.. బాబు తర్వాత టీడీపీ నాయకుడే లేకుండా పోయారన్న విమర్శలున్నాయి. దేవేందర్ గౌడ్, యనమల లాంటి వ్యక్తులు ఒకప్పుడు ఉన్నా ఇప్పుడు వారు డమ్మీలుగా ఉండిపోయారు. బాబు తర్వాత అంతా లోకేష్ చేతిలోకి తీసుకుంటున్నారు. ఇలా బాబు చేతిలోంచి ఆయన తనయుడు చినబాబు చేతిలోకి పార్టీ పోవడం.. రెండో బీసీ, దళిత నేత ఎదిగే చాన్స్ లేకపోవడంతో టీడీపీలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉందని తెలుస్తోంది. ఇది ఎప్పుడు బద్దలవుతుందో చెప్పలేమంటున్నారు. క్రమంగా బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు టీడీపీ దూరమవుతోందన్న సంకేతాలు వెలువడుతున్నాయి.

First Published:  21 Feb 2020 6:46 AM GMT
Next Story