రికార్డుల వెంట చిరంజీవి.. ఎందుకీ పని?

మెగా స్టార్ చిరంజీవి. తెలుగు తెరపై తిరుగులేని స్టార్ హీరో.. ఇన్నేళ్ల సినీ కెరీర్ లో ఎన్నో రికార్డులు బద్దలుకొట్టి కొత్త రికార్డులు సృష్టించాడు. ఇప్పుడు సీనియర్ హీరోగా.. టాలీవుడ్ దృవతారగా వెలుగొందుతున్నాడు.. అయితే ప్రస్తుతం చిరంజీవి ఈ వయసులోనూ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టాలని చూస్తుండడం టాలీవుడ్ లో చర్చనీయాంశమవుతోంది.

చిరంజీవి బాహుబలి రికార్డులను సవాల్ చేయడానికి ఇటీవల ప్రయత్నించారు. ‘సైరా’ లాంటి దేశభక్తి పీరియాడిక్ డ్రామా మూవీతో బాహుబలియేతర రికార్డులను అందుకున్నారు. అయితే ఈ ఫలితం కేవలం తెలుగు వెర్షన్ లో మాత్రమే వచ్చింది. ఇతర భాషల్లో అంతగా ఆకట్టుకోలేదు.

ఇక తన తరువాతి సినిమాను కమర్షియల్ చిత్రాల్లో సోషల్ మెసేజ్ ను అద్భుతంగా చెప్పే దర్శకుడు కొరటాల శివతో చేస్తున్నారు. చిరు, కొరటాల కాంబో చిత్రంపై బోలెడు అంచనాలున్నాయి. ఇక ఈ సినిమాలో రాంచరణ్ కూడా కనిపిస్తుండడంతో అంచనాలు పెరిగిపోయాయి.

చిరంజీవి కోసం కొరటాల కథను వివరించినప్పుడు ఒక ముఖ్యపాత్ర కోసం చరణ్ పేరును సూచించినట్టు తెలిసింది. చరణ్ చేయడానికి ఒప్పుకున్నాడు. కానీ రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీ విడుదలయ్యాకే చిరంజీవి సినిమా విడుదల చేయాలని జక్కన్న కండీషన్ పెట్టారట.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్ఆర్ఆర్ లుక్ బయటపడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాడట..

అయితే రాజమౌళి సినిమాను కొరటాల-చిరంజీవి మూవీ బద్దలు కొట్టే అవకాశం లేదు. ఆర్ఆర్ఆర్ ఒప్పందం ఉన్నప్పటికీ చరణ్ ను ముందే రిలీజ్ చేస్తామని చిరంజీవి బలవంతం చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.

అయితే ఆర్ఆర్ఆర్ భారీ చిత్రం.. వందల కోట్ల సినిమా.. చిరంజీవి సినిమా కోసం ఆర్ఆర్ఆర్ లుక్ ను చరణ్ బయటపెడితే మొదటికే మోసం అంటున్నారు. ఎన్టీఆర్ లాగా ఆర్ఆర్ఆర్ తర్వాత సినిమాలు చేస్తే బాగుంటుందని సినీ జనాలు చరణ్ కి సూచిస్తున్నారు. కానీ చిరంజీవి మాత్రం తన సినిమా కోసం చరణ్ పై ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం.