Telugu Global
NEWS

న్యూజిలాండ్ కోటలో భారత్ పాగా

టెస్ట్ సిరీస్ కు విరాట్ సేన గురి భారత జట్టు న్యూజిలాండ్ పర్యటన ఆఖరి అంకానికి చేరింది. ఐసీసీ టెస్ట్ లీగ్ లో భాగంగా రెండుమ్యాచ్ ల సిరీస్ కు… వెలింగ్టన్ లోని బేసిన్ రిజర్వ్ పార్క్ గ్రౌండ్ లో తెరలేచింది. ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ భారతజట్టే ఈ రెండుమ్యాచ్ ల సిరీస్ లో హాట్ ఫేవరెట్ గా పోటీకి దిగింది. ఇప్పటి వరకూ ఆడిన ఏడు టెస్టులు, మూడు సిరీస్ లను అలవోకగా నెగ్గడం ద్వారా 360 […]

న్యూజిలాండ్ కోటలో భారత్ పాగా
X
  • టెస్ట్ సిరీస్ కు విరాట్ సేన గురి

భారత జట్టు న్యూజిలాండ్ పర్యటన ఆఖరి అంకానికి చేరింది. ఐసీసీ టెస్ట్ లీగ్ లో భాగంగా రెండుమ్యాచ్ ల సిరీస్ కు… వెలింగ్టన్ లోని బేసిన్ రిజర్వ్ పార్క్ గ్రౌండ్ లో తెరలేచింది.

ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ భారతజట్టే ఈ రెండుమ్యాచ్ ల సిరీస్ లో హాట్ ఫేవరెట్ గా పోటీకి దిగింది. ఇప్పటి వరకూ ఆడిన ఏడు టెస్టులు, మూడు సిరీస్ లను అలవోకగా నెగ్గడం ద్వారా 360 పాయింట్లు సాధించిన భారతజట్టు…న్యూజిలాండ్ ను న్యూజిలాండ్ గడ్డపై మరోసారి చిత్తు చేయడం ద్వారా సిరీస్ సాధించాలన్న పట్టుదలతో ఉంది.

యువఓపెనర్ల సత్తాకు సవాల్…

సీనియర్ ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ గాయాలతో అందుబాటులో లేకపోడంతో…నయా ఓపెనింగ్ జోడీ మయాంక్ అగర్వాల్, పృథ్వీ షాలకు అవకాశం దక్కింది. 2018 తర్వాత పృథ్వీ షా టెస్ట్ రీ-ఎంట్రీ సాధించాడు.

విపరీతమైన ఈదురుగాలుల వాతావరణంతో కూడిన బేసిన్ రిజర్వ్ పార్క్ల్ లో ఆతిథ్య న్యూజిలాండ్ జట్టుకు చక్కటి రికార్డే ఉంది. అయితే …ఓవరాల్ గా చూస్తే.. ఇప్పటి వరకూ ఈ రెండుజట్లూ ఆడిన మొత్తం 57 టెస్టుల్లో భారత్ కు 21 విజయాలు సాధించిన రికార్డు ఉంది.

వెస్టిండీస్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ లతో ముగిసిన సిరీస్ ల్లో బ్రౌన్ వాష్ సాధించిన భారత జట్టుకు న్యూజిలాండ్ నుంచి గట్టిపోటీ ఎదురుకానుంది.

ఆరున్నర అడుగుల జైయింట్ ఆల్ రౌండర్ జైమీసన్ టెస్ట్ అరంగేట్రం ద్వారా 279 కివీ ఆటగాడిగా రికార్డుల్లో చోటు సంపాదించాడు.

బ్యాటింగ్ కు అనువుగా ఉన్న బేసిన్ రిజర్వ్ పార్క్ లో తొలి ఇన్నింగ్స్ లో భారీస్కోరు సాధించిన జట్టుకే విజయావకాశాలు ఉంటాయి.

రోజ్ టేలర్ కు 100వ టెస్టు..

మరోవైపు న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ , స్టార్ ప్లేయర్ రోజ్ టేలర్ …వెలింగ్టన్ టెస్ట్ ద్వారా వందటెస్టుల మైలురాయిని చేరిన 5వ కివీ క్రికెటర్ గా రికార్డుల్లో చేరాడు.

క్రికెట్ మూడుఫార్మాట్లలోనూ వందమ్యాచ్ ల రికార్డు సాధించిన ఆటగాడిగా రోజ్ టేలర్ గుర్తింపు తెచ్చుకొన్నాడు.

టెస్ట్ సిరీస్ కు ముందుజరిగిన 5 మ్యాచ్ ల టీ-20 సిరీస్ ను భారత్ 5-0తో నెగ్గితే…మూడూమ్యాచ్ ల వన్డే సిరీస్ ను న్యూజిలాండ్ 3-0తో సొంతం చేసుకొంది.

టెస్టు సిరీస్ లో ఏ జట్టు విజేతగా నిలువగలదన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

First Published:  20 Feb 2020 9:00 PM GMT
Next Story